కేరళ ఫైట్: RSS వర్సెస్ లెఫ్ట్

RSS-vs-Leftకేరళ రాజకీయం వేడెక్కింది. ఆగస్టు ఆరో తారీఖు ఆల్ పార్టీ మీటింగ్ కు టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ.. సీపీఎం, ఆర్ఎస్ఎస్ రెండు పార్టీలు ఒకదాని మీద ఇంకొకటి విమర్శలు చేసుకుంటున్నాయి. బీజేపీ, ఆర్ఎస్ఎస్, లెఫ్ట్ పార్టీ నేతలను టార్గెట్ చేశాయంటూ గురువారం లోక్ సభలో రచ్చ చేశారు సీపీఎం నేతలు. దీనికి ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ కౌంటరిచ్చింది.

2016 అక్టోబర్ నుంచి 14 మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను హత్య చేశారని అన్నారు సంస్థ జాయింట్ సెక్రటరీ దత్తాత్రేయ హోసబలే. ఐనా.. ఇప్పటి వరకు.. లెఫ్ట్ ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ తీసుకోలేదన్నారు.  ఆర్ఎస్ఎస్ కార్యకర్తల హత్యలపై హైకోర్టు జడ్జీతో గానీ.. సుప్రీంకోర్టు జడ్జీతోగానీ… న్యాయవిచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

అటు సంఘ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది సీపీఎం. ఇప్పటి వరకు 13 మంది లెఫ్ట్ కార్యకర్తలను ఆర్ఎస్ఎస్ హత్యచేసిందన్నారు లెఫ్ట్ నేత సీతారాం ఏచూరి. మతోన్మాదం, హింస సృష్టిస్తూ.. ప్లాన్డ్ స్ట్రాటజీతో బీజేపీ ముందుంకి పోతుందని అన్నారు. మరోవైపు ఇటీవల చనిపోయిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం త్రివేండ్రం పర్యటించనున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy