కేరళ వరదలు : 324కి చేరిన మృతులు

కేరళలో వరద ఉధృతికి ఇప్పటివరకు 324మంది చనిపోయారు. ఆరాష్ట్ర సీఎం పినరయి విజయన్ ఈ విషయాన్ని శుక్రవారం(ఆగస్టు-17) ట్వీట్టర్ ద్వారా తెలిపారు. 2లక్షల 23వేల మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. 24 గంవటల్లోనే వందమందికి పైగా వరదల్లో చనిపోయారు. NDRF, ఆర్మీ, నేవీ సిబ్బంది సహాయ చర్యల్లో పాల్గొటున్నాయి. వర్షాల ధాటికి కేరళవో వేలాది ఇళ్లు నేలమట్టం కాగా, రహదారులు దెబ్బతిన్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు రద్దయ్యాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నదులు, వాగులకు వరదపోటెత్తడంతో చాలా గ్రామాలు నీటమునిగాయి. రాష్ట్రంలోని 80 శాతం గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. కోచి ఎయిర్ పోర్ట్ ను వరద వదలకపోవడంతో ఈనెల 26 వరకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేరళకు పక్క రాష్ట్రాల నుంచి రాకపోకలు నిలిచిపోవడంతో ఇంధన, మందుల కొరత ఏర్పడింది.

NDRF, ఇండియన్ కోస్ట్ గార్డ్, భారత సైన్యం, వాయుసేన దళాలు సహాయక చర్యల్లో శ్రమిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తీసుకువెళుతున్నాయి. ఇంటి పైన వరదల్లో చిక్కుకుపోయిన ఓ గర్భిణీని నేవీ సిబ్బంది హెలికాప్టర్ తో కాపాడారు. గర్భిణీకి ప్రసవానికి సంబంధించిన నొప్పులు వస్తుండటంతో ఓ డాక్టరును ముందుగా అక్కడికి పంపించి.. తర్వాత ఆమెను హెలికాప్టర్ సాయంతో రక్షించారు. వెంటనే అలప్పుజాలోని సంజీవని మల్టీ స్పెషాలికి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎర్నాకుళం, పతనంతిట్ట జిల్లాల నుంచి 3వేల మందిని కాపాడింది NDRF. రాష్ట్రవ్యాప్తంగా పునరావాస కేంద్రాల్లో 2 లక్షల 23 వేల మంది ఆశ్రయం పొందుతున్నారు. కేరళలో రేపటివరకు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అన్ని జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని చెప్పింది. దీంతో భయంతో ప్రజలు వణికిపోతున్నారు. శాంతించాలని వరుణదేవుడిని మొక్కుతున్నారు కేరళ ప్రజలు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy