కేరళ వరద సహాయనిధికి విజయ్ దేవరకొండ,అనుపమ విరాళం


వరదలతో అతలాకుతలమైన కేరళ రాష్ట్రానికి సినీ ఇండస్ట్రీ ప్రముఖులు అండగా నిలుస్తున్నారు. తెలుగులో నటుడు విజయ్ దేవరకొండ ఫాస్ట్ గా రియాక్టయ్యాడు. కేరళ వరద సహాయనిధికి రూ.5లక్షలను విరాళంగా ఇచ్చాడు. తనకు హాలీడే స్పాట్ అంటే గుర్తొచ్చేది కేరళనే అని… కేరళలో షూటింగ్స్ తో తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపాడు. కేరళ వరదలతో తాను చాలా డిస్టర్బ్ అయ్యానని ట్విట్టర్ లో చెప్పాడు. ఈ మధ్యనే తనకు వచ్చిన ఫిలింఫేర్  అవార్డును వేలం వేసి.. వచ్చిన రూ.25లక్షల రూపాయలను తెలంగాణ సీఎం సహాయనిధికి అందించాడు విజయ్. ఇపుడు కేరళ వరదలపైనా వెంటనే స్పందించాడు.

మరోవైపు నటి అనుపమ పరమేశ్వరన్ కూడా కేరళ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు సాయపడింది. ఏకంగా రూ.10 లక్షలు పంపించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో చెప్పింది. కెరీర్.. కమర్షియల్ సక్సెస్ తో  మొదలు కావడం అంటే మాటలు కాదు. అలాంటి బ్రేక్ ఇచ్చిన కేరళ రాష్ట్రానికి తనవంతు సాయం అందిస్తున్నాని చెప్పింది అనుపమ.

చరిత్రలోనే మొదటి సారిగా 27 డ్యామ్ లు ఒకేసారి తెరిచామన్నారు కేరళ సీఎం పినరయి విజయన్. ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి అంటూ  సీఎం పినరయి విజయన్ కోరడంతో సెలబ్రిటీలు కొందరు తమవంతు సాయమందించడానికి ముందుకొస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy