కేసీఆర్‌కు అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డు

kcrసీఎం కేసీఆర్ కు అరుదైన గౌరవం లభించింది. రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్ -2017 అవార్డు లభించింది. పాలసీ లీడర్‌షిప్ కేటగిరీ కింద కేసీఆర్‌కు ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డు కోసం సీఎం కేసీఆర్ పేరును ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ ప్రతిపాదించింది. సెప్టెంబర్ 5న రాత్రి 7.30 గంటలకు న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలస్‌లో ఈ అవార్డును అందుకోనున్నారు కేసీఆర్. భారత ఆహార వ్యవసాయ మండలి ఈ అవార్డును అందజేయనుంది. లక్షలాది మంది వ్యవసాయదారుల జీవితాల్లో మార్పు కోసం కృషి చేస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు ఈ అవార్డు లభించిందని స్పష్టం చేసింది అవార్డు కమిటీ.

 

cm

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy