కేసీఆర్‌ అంటే కాళేశ్వరం చంద్రశేఖర్‌రావు

kkకాళేశ్వరం ప్రాజెక్టును చూసిన తర్వాత సీఎం కేసీఆర్‌ను కాళేశ్వరం చంద్రశేఖర్‌రావు అని పిలవాలనిపిస్తున్నదని అన్నారు గవర్నర్ నరసింహన్. శనివారం(జనవరి-20) ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను సందర్శించారు. ఆయన వెంట మంత్రి హరీశ్ రావు, ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన గవర్నర్… కాళేశ్వరం ప్రాజెక్ట్ వెనక పెద్ద టీమ్ వర్క్ ఉందన్నారు. ఈ ప్రాజెక్ట్ చాలా గొప్ప ప్రాజెక్ట్ అన్నారు. మరో ఆరు నెలల్లో ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఆశిస్తున్నానన్నారు. ప్రాజెక్ట్ పనుల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ గవర్నర్ అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy