కేసీఆర్.. అనునేను..! రేపు 1.30కి సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారం

Telangana Rashtra Samithi (TRS) chief K Chandrasekhar Rao (KCR) with common Governor for Andhra Pradesh and Telangana E S L Narasimhan after swearing in as the first chief minister of Telangana at Raj Bhavan in Hyderabad on June 2, 2014. (Photo: IANS)

తెలంగాణ ముఖ్యమంత్రిగా కె.చంద్రశేఖర్ రావు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. రేపు మధ్యాహ్నం ఒంటిగంటా ముప్పై నిమిషాలకు KCR ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజ్ భవన్ లో సీఎం చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాజ్ భవన్ లో  ఇవాళ ఉదయం గవర్నర్ నరసింహన్ తో కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రురోలా, సీఈఓ రజత్ కుమార్ సమావేశం అయ్యారు. 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచినట్టుగా అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేసి ఈసీకి పంపించారు సీఈఓ రజత్ కుమార్. ఈ సమావేశం తర్వాత.. సీఎం ప్రమాణ స్వీకారానికి డేట్ ఫిక్స్ చేశారు అధికారులు. గెలుపొందిన అభ్యర్థుల జాబితాను గవర్నర్ కార్యాలయం గెజిట్ రూపంలో విడుదల చేస్తుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy