కేసీఆర్ తీర్మానం : వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం

Kcr-Speechకేంద్ర ప్రభుత్వానికి బహిరంగ తీర్మానం చేశారు సీఎం కేసీఆర్. రైతుబంధు పథకం ప్రారంభం సందర్భంగా హుజూరాబాద్ సభలో మాట్లాడిన సీఎం.. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. దీని వల్ల రైతు పెట్టుబడి ఖర్చు మరింత తగ్గటమే కాకుండా.. రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి మరింత దొరుకుతుందన్నారు.

ఇప్పటికే ఈ విషయంపై కేంద్రంతో మాట్లాడాం అన్నారు. ఉపాధి హామీ పనులను వ్యవసాయ రంగాన్ని మళ్లించినట్లయితే రైతు పెట్టుబడి మరింత తగ్గటంతోపాటు ఆసరాగా ఉంటుందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతోపాటు రాష్ట్రం కూడా సగం భరించటానికి సిద్ధంగా ఉందన్నారు. ఈ సభ నుంచే కేంద్రానికి తీర్మానం చేసి పంపిస్తున్నట్లు ప్రకటించారు. అదే విధంగా పంటల గిట్టుబాటు ధరను 25శాతం పెంచాలని డిమాండ్ చేశారు. కష్టపడి పండించే పంటకు కనీస మద్దతు ధర లేకపోతే ఎలా బతుకుతారని నిలదీశారు. వెంటనే కేంద్రం 25శాతం మద్దతు పెంచి.. రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy