కేసీఆర్ తోనే బంగారు తెలంగాణ : హరీష్

harish-raoతెలంగాణలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే కేసీఆర్ లక్ష్యమన్నారు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు.  తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రూ. 400 కోట్లతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకానికి ముఖ్యమంత్రి  కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాకలో శ్రీకారం చుట్టారు.. ఇది ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు హరీష్. కొండపాక మండలంలోని 825 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను అందజేశారు. ఒక్కో యూనిట్‌లో 21 జీవాలుంటాయి. ఇందులో 20 గొర్రెలు, ఒక పొట్టేలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకరావాలనేదే కేసీఆర్ అభిమతమన్నారు. తెలంగాణలో ‘ పల్లే కన్నీరు పెడుతుంది ‘ అనే పాటలొచ్చాయి..కానీ ఇక తెలంగాణలో పన్నీరు వొలికిస్తుందనే పాటలు రాబోతున్నాయన్నారు హరీష్ రావు. తెలంగాణలో వ్యవసాయంతోపాటు, కులవృత్తులను బలోపేతం చేయడానికి కేసీఆర్ కంకణబద్దుడై ముందుకు సాగుతున్నారన్నారు. ఒక కొత్త రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇవాళ కొండపాకలో బీరప్ప పండుగ వాతావరణం నెలకొంది అని పేర్కొన్నారు హరీష్. గొల్లకురుమలకు కొండపాకలో గొర్రెలు పంపిణీ చేయడం సంతోషాన్నిస్తుందన్నారు. గ్రామాల్లో కులవృత్తులను గుర్తించి పల్లెల్లో రెప్పపాటు కరెంట్ పోకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని చెప్పారు. మిషన్ కాకతీయతో చెరువుల్లోకి నీరు రావడంతో చెరువులు కళకళలాడుతున్నాయన్నారు హరీష్ రావు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy