కేసీఆర్ ను కలిసిన దేవెగౌడ

KTRసీఎం కేసీఆర్ ను కలిశారు JDS చీఫ్, మాజీ ప్రధాని దేవెగౌడ. హైదరాబాద్ టూర్ లో భాగంగా శనివారం రాత్రి సిటీకి చేరుకున్న దేవెగౌడ..ఆదివారం (జూలై-1) మధ్యాహ్నం ప్రగతి భవన్ లో కేసీఆర్ ను మర్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ దేవెగౌడకు ఘనస్వాగతం పలికారు. దేవగౌడను ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు.

ఈ సమావేశంలో జాతీయ రాజకీయాలపై ఇరువురు నేతలు చర్చించారు. కేసీఆర్‌తో భేటీ తరువాత మాజీ ప్రధాని నేరుగా బేగంపేట విమానాశ్రయం నుంచి బెంగళూరు బయలుదేరారు. ఈ స‌మావేశంలో మేయ‌ర్ రామ్మోహ‌న్‌, ప‌లువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎంపీ సుబ్బిరామిరెడ్డి మనువడి వివాహానికి హాజరయ్యేందుకు శనివారం రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy