కేసీఆర్ మొండి కదా…అందుకే వారికి భయం

kcr-trs-2018దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు రావాలన్నారు సీఎం కేసీఆర్.  గురువారం ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ ఇటీవలే ఫెడరల్ ఫ్రంట్ గురించి తాను చేసిన ప్రకటన దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిందన్నారు. ప్రధాని మోడీ ఏజెంట్ కేసీఆర్ అని రాహుల్ గాంధీ అంటున్నారు… ఫ్రంట్‌కు టెంటే లేదనింటున్నాడు మాడీ. టెంటే లేనప్పుడు బీజేపీ నేతలకు భయమెందుకు? అని ప్రశ్నించారు. కేసీఆర్ అంటే అందరికీ భయం… కేసీఆర్ మొండి కదా… అందుకే వారికి భయం… దేశం బాగు కోసం ఎంతకైనా పోరాడుతానన్నారు ఆయన.

తెలంగాణను ఎట్ల అయితే తెచ్చి చూపిన్నో… దేశం మంచి కోసం కూడా ఆ విధంగా పని చేస్తానన్నారు కేసీఆర్. ఎవ్వరికీ భయపడను… మీ అందరి సహకారంతో ముందుకు పోతాను. జాతీయ రాజకీయాల్లో టీఆర్‌ఎస్ క్రియాశీలక పాత్ర పోషించే బాధ్యతను ప్రజలు అప్పగించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. వారి ఆటలు సాగనివ్వనన్నారు కేసీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy