కేసులు గెలిపించడంలో.. శివానంద్ ప్రసాద్ ది కీలక పాత్ర

తెలంగాణ రాష్ట్ర నూతన అడ్వొకేట్ జనరల్ గా బండ శివానంద ప్రసాద్ నియామకం అయ్యారు. జనగామకు చెందిన శివానంద ప్రసాద్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఏజీగా శివానంద ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం రిసెంట్ గా ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ఏజీ నియామకానికి సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంతకం చేశారు. మార్చి 26న ఏజీ పదవికి ప్రకాశ్‌ రెడ్డి రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీ అయింది. వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా చేశారు. ప్రకాశ్‌ రెడ్డి రాజీనామాను ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. తాజాగా బలహీన వర్గానికి చెందిన బీఎస్ ప్రసాద్‌ ను ఏజీగా  నియమించడంపై న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర నూతన అడ్వకేట్ జనరల్‌గా బండ శివానందప్రసాద్ అపాయింట్ అయ్యారు. జనగం జిల్లాకు చెందన బండ శివానంద్ ప్రసాద్ 1963 ఆగస్టు 31 జన్మించారు. బీసీ పద్మశాలి వర్గానికి చెందిన శివానంద్ ప్రసాద్ ఎంఏ, ఎల్ ఎల్ బీ చదువు పూర్తి చేశారు. శివానంద్ ప్రసాద్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మొదటి కూతురు నేషనల్ లా యూనివర్సిటీ ఒడిసాలో  బీఏ ఎల్ ఎల్ బీ పూర్తి చేసిది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ ఎల్ ఎం చదువుతోంది. ఇక సెకండ్ కూతురు రిసెంట్ గా తమిళనాడు నేషనల్ లా యూనివర్సిటీలో బీఏ ఎల్ ఎల్ బీ పూర్తి చేసింది. మూడో కూతురు ఆరోగ్య కారణాలతో ఇంట్లోనే ఉంటుంది.

శివానంద్ ప్రసాద్ 1987 జనవరి 30 బార్ కౌన్సిల్ లో అడ్వకేట్ గా ఎన్ రోల్ చేయించుకున్నారు. ఆయన 30 సంవత్సరాలుగా సీనియర్ న్యాయవాదిగా, ప్రభుత్వ న్యాయవాదిగా పని చేశారు. అంతేకాదు.. హైకోర్టు, సివిల్ కోర్టు, సికింద్రాబాద్, రంగారెడ్డి, ఇలా వివిధ కోర్టులో న్యాయవాదిగా తన సేవలు అందించారు. శివానంద్ ప్రసాద్ సివిల్, క్రిమినల్, రాజ్యాంగం, టాక్సెషన్, లేబర్, కంపేనీ విషయంలో వాదనలు చేసేవారు. స్పెస్పిక్ గా సివిల్, బ్యాంకింగ్, వ్రిట్ పిటిషన్ లో ఎక్కువగా వాదనలు వినిపించేవారు.

అంతేకాదు… శివానంద్ ప్రసాద్ తెలంగాణ ప్రభుత్వం నుంచి సుప్రీం కోర్టుతో పాటు హైకోర్టులో ముఖ్యమైన కేసులలో వాదనలు వినిపించి కేసులను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. అందులో ఎక్కువగా మెడికల్, హెల్త్, ప్యామిలీ వెల్పర్, సోషల్ వెల్పర్ డిపార్టుమెంట్ లకు చెందిన కేసులు ఉన్నాయి. ఇక శివానంద్ ప్రసాద్… హైకోర్టు నిర్వహించిన పరీక్షలో డిస్ట్రిక్ జడ్జీ గ్రేడ్ 2 మూడు సార్లు సెలక్ట్ అయ్యారు. శివానంద్ ప్రసాద్ సీనియర్ న్యాయవాదిగా, ప్రభుత్వ న్యాయవాదితోపాటు స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆప్ కామర్స్, విజయ బ్యాంక్ లకు లీగల్ అడ్వైసర్ గా చేయడంతో వివిధ పైనాన్సియల్ ఇండస్ట్రీలలో న్యాయవాదిగా తన సేవలను అందించారు.

బండ శివానంద్ ప్రసాద్ సీనియర్ న్యాయవాదిగా తన సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనను తెలంగాణ రాష్ట్ర నూతన అడ్వొకేట్ జనరల్ గా నియమించింది. జనగామకు చెందిన శివానంద ప్రసాద్ హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఏజీగా శివానంద ప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం రిసెంట్ గా ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ఏజీ నియామకానికి సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంతకం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తనపై ఉంచిన నమ్మాకానికి తాను ప్రభుత్వం తరుపున అన్ని కేసులను గెలిపించేందుకు ప్రయత్నం చేస్తానన్నారు. అలాగే హైకోర్టులో పెండింగ్ లో ఉన్న ప్రభుత్వం కేసులను త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy