కేసుల పరిష్కారమే లక్ష్యం : రాత్రంతా పిటిషన్లు విచారించిన హైకోర్టు జడ్జి

bombay
పెండింగ్ లో ఉన్న కేసులను విచారించేందుకు వినూత్న నిర్ణయం తీసుకొన్నారు బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్‌ షారుఖ్‌ జే. కతవాలా. ఓ వైపు కోర్టుకు వేసవి సెలవులు రానుండటంతో.. చివరి వర్కింగ్ డే కావడంతో అత్యవసర విచారణ పిటిషన్లతో బాంబే హైకోర్టు కిక్కిరిసిపోయింది. అత్యవసరమైన కేసుల విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు శుక్రవారం సాయంత్రం 5గంటల వరకూ విచారణలు కొనసాగించింది హైకోర్టు.  అయితే జస్టిస్  కతవాలా(59) మాత్రం వేకువజామున 3:30 గంటల వరకూ కేసులను విచారించారు. అతనితోపాటు సీనియర్‌ లాయర్లు కోర్టులోనే ఉన్నారు.  ఉదయం 10 గంటల నుంచి అలుపులేకుండా, ఓపికగా,  చివరి నిమిషం వరకూ  ఉదయం ఎంత ఎనర్జిటిక్ గా ఉన్నారో.. అంతే ఎనర్జీతో కోర్టు రూములో పిటిషన్లను విచారించారని, కేవలం 20 నిమిషాల బ్రేక్ మాత్రమే తీసుకొన్నాడని  ఓ లాయర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy