కొండచరియలు విరిగిపడి…31 మంది మృతి

ఉగాండాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పశ్చిమ ఉగాండాలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. బుడుడా జిల్లాలోని బుకాలసీ పట్ణణ నదీ తీర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. వర్షాలు, కొండచరియల ఎఫెక్ట్ తో పరిసర ప్రాంతాల్లో బురదనీరు చేరుకుందని, ఐదు గ్రామాలపై ఈ ప్రభావం ఉందని విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ నాథన్ తుముహమ్యే తెలిపారు. వర్షాభావ ప్రాంతాల్లో సహాయక బృందాలను ప్రభుత్వం పంపించిందన్నారు. స్థానికుల సహకారంతో సహాయచర్యలు చేపట్టారు అధికారులు. నీట మునిగిన ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy