కొండ ప్రాంతాల్లో మొక్కలు పెంచేందుకు’ సీడ్ బాల్స్’

seed-balls

హరితహారంలో మొదటి స్థానంలో నిలిచిన వరంగల్ పోలీసులు.

వరంగల్ జిల్లాలో హరితహారం కార్యక్రమం జోరుగా నడుస్తోంది. మొక్కలు నాటి, ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేసే పనులు ముమ్మరంగా సాగుతుంటే… ఇంకోదిక్కు అడవులు, గుట్టలను పచ్చగా చేసే పనిలో పడ్డారు అధికారులు. ఇందుకోసం ముందుగానే సీడ్ బాల్స్ తయారీని మొదలుపెట్టారు. వాటిని కొండలు, గుట్టల్లో చల్లే పనిని కూడా ప్రారంభించారు. ముందు వరంగల్, జనగామ జిల్లాల్లో ఉన్న గుట్టల్లో మొక్కలు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అడవుల  విస్తీర్ణం పెంచేందుకు మొదలుపెట్టిన హరితహారం కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లాలో జోరుగా సాగుతుంది. అయితే ఈసారి  అడవులు, గుట్టలు, కొండ ప్రాంతాల్లోకూడా మొక్కలు పెంచేందుకు సీడ్ బాల్స్ విధానాన్ని తీసుకొచ్చింది సర్కార్.

కర్ణాటకలో మొదటిసారిగా ఈ పద్దతిలో అడవుల్లో మొక్కలు పెంచారు. మామూలుగా అయితే  గొయ్యి తవ్వి మొక్కలు నాటుతుంటారు. కానీ సీడ్ బాల్ బాంబింగ్ పద్ధతిలో సేంద్రియ ఎరువులతో కూడిన సారవంతమైన మట్టిని ముందుగా నీటితో తడిపి ఒక బంతి లాగా చేసి,  సేకరించిన విత్తనాలను అందులో పెడతారు.  బంజరు భూములు, చెట్లు  తక్కువగా ఉన్న అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలలో ఈ బంతులను చల్లుతారు. వర్షాలు పడితే సీడ్  బాల్స్  తడిసి అందులో ఉన్న విత్తనాలు మొలకెత్తుతాయి.

కమిషనరేట్ పరిధిలో రెండో విడతలోనే  10 లక్షల మొక్కలు నాటి హరితహారంలో రాష్ట్రంలోనే మొద టి స్థానంలో నిలిచారు వ రంగ ల్ పోలీసులు. తాజాగా సీడ్ బాంబింగ్ విధానంలోనూ రికార్డు సాధిస్తున్నారు. కొండ లు, ఎత్తయిన ప్రాంతాల్లో  లక్షల సీడ్ బాల్స్ వేసేందుకు ముందుగానే వీటిని తయారుచేశారు. మడికొండ పోలీసు ట్రైనింగ్ సెంటర్ లో  సీడ్ బాంబులను సిద్ధం చేశారు. ఇప్పటికే వరంగల్ అర్భన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లోని గుట్టల్లో కలెక్టర్ అమ్రపాలీ, సీపీ సుదీర్ బాబు విద్యార్థిలు, సిబ్బంది తో కలిసి సీడ్స్ బాల్స్ ప్రయోగించారు. నగర సమీపంలోని ఎర్రగుట్టల్లో మొన్నటి వర్షానికి విత్తనాల మొలకెత్తినట్లు గుర్తించారు.

హరితహారం పథకం విజయవంతం చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని మెథడ్స్ వాడుతున్నామని చెప్పారు సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్. మన రాష్ట్రంలో 24శాతం అడవులున్నా.. గుట్టలే ఎక్కువ ఉన్నయని చెప్పారు. ఈ గుట్టల్లోకి వెళ్లి మొక్కలు నాటే పరిస్థితి లేనందున సీడ్ బాల్ టెక్నాలజీని వాడుతున్నట్టు తెలిపారు. జనగామ జిల్లాలో గుట్టలు, కొండలు ఎక్కువ. సరైన వర్షాలు లేక ఇక్కడ కరువు ఎక్కువుంది. దీంతో హరితహారంలో కొండలు.. గుట్టలు పచ్చని చెట్లతోటి ఉంచేందుకు కలెక్టర్ దేవసేన కృషిచేస్తున్నారు. గుట్టలు.. కొండల పైకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో…సీడ్ బాల్స్ విధానానికి  ప్రాధాన్యం ఇస్తున్నారు. గతంలో కూడా పద్దతి  ఉన్నా క్రమంగా మర్చిపోయామన్నారు. మొక్కలు నాటడం, విత్తన బంతులను గుట్టలపై చల్లడం, పద్దతులు ఏవైనా.. రాష్ట్రాన్ని పచ్చగా మార్చడమే లక్ష్యమంటున్నారు అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy