కొడుకులు ఇచ్చిన జీవితం : నాడు ఆక్స్ ఫోర్డ్ ప్రొఫెసర్.. ఇవాళ వీధుల్లో దుర్భర స్థితి

ూిేఅతని పేరు రాజాసింగ్ పూల్. వయస్సు 74 ఏళ్లు. ఆక్స్ ఫోర్డ్ వర్సిటీలో ప్రొఫెసర్. ఎంతో మందిని విద్యాబుద్ధులు చెప్పి గొప్పవారిగా తీర్చిదిద్దాడు. చదువుకు ఉన్న విలువ తెలుసు కాబట్టి.. సొంత కుమారులకు కూడా ఉన్నత విద్య ఇవ్వాలని భావించాడు. ఆ క్రమంలోనే లండన్ లోని ఆక్స్ ఫోర్డ్ వర్సిటీలోని ప్రొఫెసర్ ఉద్యోగం వదిలేసి తమ్ముడితో కలిసి ఇండియా వచ్చాడు. అది 1960 కాలం. తమ్ముడితో కలిసి ముంబైలో మోటార్ పార్ట్ ల వ్యాపారం మొదలుపెట్టాడు. కొన్నేళ్లు తమ్ముడు చనిపోవటంతో వ్యాపారం కూడా దెబ్బతిన్నది. ఈ టైంలో కొడుకులు ఉన్నత విద్యకు వచ్చారు. దీంతో ఉన్న ఆస్తులతోపాటు.. ఉద్యోగం చేస్తూ ఓ కుమారుడిని లండన్, మరో కుమారుడిని అమెరికా పంపించారు.

అలా అమెరికా వెళ్లిన రాజాసింగ్ పూల్ ఇద్దరు కుమారులు తిరిగి ఇండియా రాలేదు. అక్కడే చదువుకుని.. అక్కడే పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. కొన్నాళ్ల వరకు ఫోన్ ద్వారా టచ్ లో ఉన్నా.. 10 సంవత్సరాలుగా అసలు పట్టించుకోవటం మానేశారు. దీంతో ఉన్న ఆస్తులను కొడుకుల చదువు కోసం చేసిన అప్పులు తీర్చటానికి అమ్మేశాడు. తమ్ముడి కుటుంబం కూడా లేకపోవటం.. భార్య చనిపోవటం, కుమారులు వదిలేయటంతో రాజాసింగ్ పూల్ రోడ్డున పడ్డాడు. ఢిల్లీలోని యూకే కాన్సులేట్ సెంటర్ దగ్గర అభ్యర్థులకు సూచనలు, సలహాలు ఇవ్వటంతోపాటు వీసా దరఖాస్తు చేసుకోవటానికి వచ్చే వారికి సాయం చేస్తూ ఉంటాడు. సాయం చేసిన వారు ఏమైనా డబ్బులు ఇస్తే తీసుకుంటాడు. అది కూడా తన తిండికి కావాల్సినంత సొమ్ము మాత్రమే. లక్షలు, కోట్ల డబ్బున్న పిల్లలు ఎంతో మంది రాజాసింగ్ పూల్ సాయం చేసినా.. ఎవర్నీ డబ్బులు అడగడు. సాయంత్రం కాగానే తలదాచుకోవటానికి ఢిల్లీ రైల్వే స్టేషన్ కు వెళతాడు.

యూకే వీసా కోసం కాన్సులేట్ కు వచ్చిన అవినాష్ అనే వ్యక్తి.. అతని ఇంగ్లీష్ పరిజ్ణానం, వీసా దరఖాస్తులో అని పనితనం చూసి షాక్ అయ్యాడు. ఏం చదువుకున్నారు.. మీ ఫ్యామిలీ ఏంటీ అనే పదే పదే ప్రశ్నించటంతో చాలా సేపటికి నోరు విప్పాడు రాజాసింగ్ పూల్. అతని చెప్పిన విషయాలను చలించిన అవినాష్.. అతని ఫొటోలు, వివరాలతో ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు. ఏప్రిల్ 21వ తేదీ పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అయ్యింది. మూడు రోజుల్లో 5వేలకు పైగా షేర్లతో ఢిల్లీ ప్రభుత్వ ఉన్నతాధికారులకు చేరింది. దీంతో వెంటనే స్పందించిన వారు.. రాజాసింగ్ పూల్ ను ఢిల్లీలోని ఓల్డేజ్ హోంకి తరలించారు. అతని పోస్ట్ చూసిన ఎంతో మంది పూర్వ విద్యార్థులు, మానవతా వాదులు సాయం చేస్తామని ముందుకు వస్తున్నారు.

He is an Oxford graduate who shifted to India on the insistence of his brother in the Sixties – 60s. Today 76-year-old…

Avinash Singh 发布于 2018年4月20日周五

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy