కొత్తగా : ఇక నుంచి జనవరిలోనే కేంద్ర బడ్జెట్

Union-Budgetకేంద్ర ప్రభుత్వం మరో చారిత్రక నిర్ణయం తీసుకోబోతుంది. ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్, ఎండింగ్ నెలలో మార్పులు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం బడ్జెట్ ఏడాది ఏప్రిల్ లో మొదలై.. మార్చితో ఎండ్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఫైనాన్షియల్ ఇయర్ జనవరిలో మొదలై డిసెంబర్ లో ముగుస్తుంది. 2018లో కేంద్ర బడ్జెట్ జనవరిలోనే ప్రవేశపెడతారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ నిర్ణయంతో ప్రభుత్వ పథకాలకు నిధులు ఒక నెల ముందుగానే అందుతాయని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు.

2016లో నోట్లు రద్దు చేసి.. సంచలనం సృష్టించారు మోడీ. దశాబ్దాల నుంచి కొనసాగుతున్న పంచవర్ష ప్రణాళికల ప్లేస్ లో నీతి ఆయోగ్ ను ఏర్పాటు చేశారు. మునుపెన్నడు లేనటువంటి ప్రణాళిక, ప్రణాళికేతర బడ్జెట్ లలో మార్పు చేశారు. ఇక జనరల్ బడ్జెట్ తో కలిపి రైల్వే బడ్జెట్ ను తొలిసారిగా పార్లమెంట్ లో ప్రవేశ పెట్టడం జరిగింది. ఏళ్ల తరబడి ఉన్న సాంప్రదాయానికి చరమగీతం పాడి.. కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది కేంద్ర సర్కార్.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy