కొత్త ఆప్షన్: మీ మొబైల్ లో అలర్ట్ బటన్‌

ఆడవారికి ప్రత్యేకం ఈ న్యూస్. ఆఫీస్‌ అయ్యే సరికి కాస్త ఆలస్యం అయ్యింది. గల్లీలో చీకట్లోనే నడుస్తున్నారు. ఇంతలో ఎవరో మిమ్మల్ని  వెంబడిస్తుంటాడు. కాసేపటికే అతనికి మరి కొందరు తోడవుతారు. మీ గుండె, నడక వేగాలు పెరిగాయి. వాళ్లు వేగంగా మీవైపు వస్తున్నారు. కేకలు వేసి పిలుద్దామంటే కనుచూపు మేరలో ఎవరూ లేరు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకే‘అలెర్ట్‌ బటన్‌ ని అందిస్తున్నాయి కొన్ని యాప్‌ లు.

యాప్‌ ఓపెన్‌ చేసి బటన్‌ ప్రెస్‌ చేయగానే సేవ్‌ చేసుకున్ననంబర్లకు ప్రమాదంలో ఉన్నట్లు సమాచారం వెళ్తుంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో సెల్‌ ఫోన్‌ బయటకు తీయటం, స్క్రీన్‌ ను టచ్‌ చేయటం, యాప్‌ లోకి వెళ్లటం..కొంచెం కష్టమైన పనే. దీనికి టైం కూడా పడుతుంది. ఇలాంటి సమస్యను అధిగమించేందుకు పానిక్‌ బటన్‌ ఆప్షన్‌ రాబోతోంది.

వచ్చే ఏడాది నుంచి కొత్తగా అమ్మబోయే ఫోన్‌లలో పానిక్‌ బటన్‌ తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం సెల్‌ ఫోన్‌ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. స్క్రీన్‌ లాక్‌ , పవర్‌‌‌‌, సౌండ్‌ వాల్యూమ్‌ బటన్‌ల తరహాలోనే పానిక్‌ బటన్‌ ను ప్రత్యేకంగా ఇస్తారన్నమాట. దీంతో పాటు ప్రతీ స్మార్ట్‌ ఫోన్‌ లో జీపీఎస్‌ బటన్‌ సౌకర్యం కూడా ఉండాలని స్పష్టం చేసింది. అయితే దీనికి కాస్త సమయం పడుతుందని మొబైల్‌ కంపెనీల సమాఖ్య కేంద్రానికి వివరణ ఇచ్చుకుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy