కొత్త ఇంటికి SBI ఆఫర్ : హోం లోన్ పై వడ్డీ తగ్గింపు

sbiకొత్త ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటున్నారా.. మీ బడ్జెట్ 30లక్షల రూపాయలు లోపు అనుకుంటున్నారా.. అయితే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి ఆఫర్ తీసుకొచ్చింది. రేపటి నుంచి (మే 9) జూలై 31వ తేదీ వరకు SBI నుంచి ఇంటి రుణం తీసుకుని కొనుగోలు చేసేవారికి వడ్డీ రాయితీ ప్రకటించింది. అది కూడా 30లక్షలలోపు మధ్య తరగతి కుటుంబాలకు మాత్రమే ఈ తగ్గింపు ఉంటుంది.

మహిళలకు పాయింట్ 25శాతం, మగవారికి పాయింట్ 20శాతం తగ్గింపు ప్రకటించింది బ్యాంక్. తగ్గిన వడ్డీ రేటుతో EMI నెలకు 530 రూపాయల వరకు కలిసివస్తుందని చెబుతున్నారు బ్యాంక్ అనలిస్ట్ లు. ఏడాది లెక్క తీసుకుంటే.. కనీసం ఆరు వేల రూపాయలుగా ఆదా అవుతుందని చెబుతున్నారు. మధ్యతరగతి బడ్జెట్ 30లక్షలలోపే ఉంటుందని.. మెట్రో నగరాల్లో 80శాతం అమ్మకాలు కూడా ఈ రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు. 2022 నాటికి అందరికీ ఇల్లు అని మోడీ నినాదంలో భాగంగానే ఈ స్కీమ్ తీసుకొచ్చింది. తగ్గించిన వడ్డీ రేట్లు చూస్తే మహిళలకు 8.35శాతం, మగవారికి 8.40శాతంగా ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy