కొత్త కాంతి సంక్రాంతి

sankranti 15మూడు రోజుల ముచ్చటైన పండుగ. ఒక్కో రోజు… ఒక్కో స్పెషాలిటీ… ముత్యాల ముగ్గులు, గంగిరెద్దుల ఆటాపాట, హరిదాసుల కీర్తనలు, నోరూరించే పిండివంటలు. ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో ఎన్నెన్నో. రెండోరోజు మకర సంక్రాంతిని ఘనంగా జరుపుకుంటున్నాయి తెలుగు లోగిళ్లు. సంక్రాంతి… ముచ్చటైన మూడు రోజుల పండుగ. తెలుగుదనం ఉట్టిపడేలా… ప్రతి లోగిల్లో ఘనంగా నిర్వహించే పండుగ. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసు కీర్తనలు, ఆడపిల్లల రంగవల్లులు, మహిళల గొబ్బెమ్మలు, చిన్నారుల పతంగులు….మగవాళ్ల కోడిపందాలు….ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఎన్నెన్నో ప్రత్యేకతల సమ్మేళనం సంక్రాంతి. పిల్లల నుంచి పెద్దల వరకు ఆనందోత్సాహాల మధ్య జరపుకునే అతి పెద్ద పండుగ. తెలుగువారి అతిపెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. అసలు సంక్రాంతి అంటే మారడం అని అర్థం. సూర్యుడు ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. అలా సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే కాలామే మకర సంక్రమనం. దీన్నే మనం సంక్రాంతిగా జరుపుకుంటాం. ఈరోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశిస్తుంది. ఈ పుణ్యకాలంలో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయని  భక్తుల నమ్మకం. అందుకే ఈ రోజున మహిళలు పెద్ద ఎత్తున గౌరమ్మ పూజలు చేసి…నోములు నోచుకుంటారు. ధనుర్మాస ఆరంభంతో నెల రోజులు పాటు సంక్రాంతి వాతావరణం కనిపిస్తుంది. ఆ నెల రోజులు తెలుగు పల్లెలు ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంటాయి. ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను మహిళలు రంగురంగుల ముగ్గులతో అలంకరిస్తారు. కోడి పందాలు, గంగిరెద్దుల విన్యాసాలు, ఎడ్ల బళ్ళ పందాలతో పండగ శోభ కనిపిస్తుంది. సంక్రాంతి రోజున గంగిరెద్దులు ప్రత్యేక ఆకర్షణ. రంగురంగుల బట్టలతో అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా నృత్యాలు చేయిస్తారు. ఇక హరిలో రంగ హరీ అంటూ చిడతలు వాయిస్తూ హరిదాసులు చేసే హడావిడి అంతా ఇంతాకాదు. సంక్రాంతి పండుగ అంటేనే గుర్తుకు వచ్చేది పిండివంటలు.. కోడి పందేలు. పండగలో వీటి విశిష్టత అంతా ఇంతా కాదు. పండగకు వారం ముందే ప్రతీ ఇళ్లు పిండివంటల గుమగుమలతో ఆకర్శిస్తుంది. ఇక పండగలో కొత్త అళ్లుల్లకు చేసే మర్యాదలు అన్నీ ఇన్నీ కావు. సంక్రాంతి తరువాతి రోజు వచ్చేది కనుమ పండుగ. దీన్నే పశువుల పండగా అనికూడా అంటారు. ఈ రోజున పశువులను పూజించడం ఆనవాయితీ. ఏడాది మొత్తం రైతులకు అండగా ఉన్న పశువులను ప్రత్యేకంగా అలంకరించి దానాపెట్టి పూజలు చేస్తారు. సాయంకాలం ఊరిలో ఉన్న దేవాలయం చుట్టూ పశువులతో ప్రదక్షణలు చేస్తారు రైతులు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy