కొత్త పార్టీకి రజనీ సన్నాహాలు

_Rajiniతమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మరో పక్షం రోజుల్లో కొత్త పార్టీని పెడతారని చెప్పారు  గాంధేయ ఉరుమై ఇయక్కం అధ్యక్షుడు తమిళురువి మణియన్‌. ఇటీవలికాలంలో తాను రెండుసార్లు రజనీకాంత్‌తో సమావేశమై రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించానని చెప్పారాయన. రాష్ట్ర ప్రజలపై ఆయనకు ఎంతో గౌరవమర్యాదలు, ప్రేమాభిమానాలు ఉన్నాయనన్నారు మణియన్‌. రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వచ్చేది డబ్బు, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునేందుకు కాదని, తనను పెంచి పోషించిన ప్రజలకు తనకు చేతనైన మేలు చేయాలన్న ఉద్దేశంతోనేనని చెప్పారు ఆయన. మరో పక్షం రోజుల్లో రజనీ కచ్చింతగా రాజకీయ పార్టీని ప్రాంభిస్తారని, పార్టీ స్థాపనపై ఒక స్పష్టమైన ప్రకటన చేశాక… తన సిద్ధాంతాలు, ఆశయాలను వెల్లడించే అవకాశం ఉందన్నారు మణియన్‌.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy