కొత్త రూల్స్ : పిచ్చి చేష్టలు చేస్తే నిషేధం

airlineవిమానాల్లో కొత్త రూల్స్ ప్రకటించింది సివిల్ ఏవియేషన్ డిపార్ట్ మెంట్. ఆ శాఖ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు దీనికి సంబంధించిన నియ‌మావ‌ళిని శుక్రవారం(మే 5) వెల్ల‌డించారు. విమానాల్లో అనుచితంగా ప్ర‌వ‌ర్తించే ప్ర‌యాణికుల‌కు మూడు నెల‌ల నుంచి రెండేళ్ల వ‌ర‌కు నిషేధం విధించ‌నున్న‌ట్లు చెప్పారు. ప్ర‌జ‌ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్న త‌ర్వాత జూన్ నెల నుంచి ఈ రూల్స్‌ను అమ‌లు చేయ‌నున్నామన్నారు. మొత్తం మూడు ర‌కాల నిషేధాల‌న్నాయి. విమానాల్లో కానీ, విమానాశ్ర‌యాల్లో కానీ ఇబ్బందులు క‌లిగించే ప్ర‌యాణికుల‌పై ఈ నిషేధం విధించ‌నున్నారు.

మూడు కేటగిరిల్లో నిషేధాలు:

… పిచ్చి సంకేతాలు, భాషతో ఇబ్బంది పెడితే మూడు నెల‌లు నిషేధం

… లైంగిక వేధింపులకు ఆరు నెల‌లు నిసేధం

… బెదిరింపులకు పాల్పడితే రెండేళ్ల నిషేధం

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy