కొత్త వాదన: సుభాష్ విమాన ప్రమాదంలో చనిపోలేదు

Subhash_Chandra_Bose_360స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం నేటికీ మిస్టరీగానే కొనసాగుతుంది. బోస్ ఎలా మరణించారనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.. భిన్న వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. దీనిపై భారత ప్రభుత్వం షానవాజ్ కమిషన్ (1956), ఖోస్లా కమిషన్ (1970) ముఖర్జీ కమిషన్ (1999) నియమించినా, కచ్చితమైన నిర్ధారణకు రాలేదు. తాజాగా, కొత్త ట్విస్ట్ ఇచ్చారు. నేతాజీ అసలు విమాన ప్రమాదంలో చనిపోలేదని, 1947 వరకు బోస్ బతికే ఉన్నారని చెప్తున్నారు ఫ్రెంచ్ చరిత్రకారుడు జేబీపీ మోరె. 1947 డిసెంబర్ 11న అప్పటి ఫ్రెంచ్ సీక్రెట్ సర్వీస్ ఇచ్చిన నివేదిక ఇందుకు సాక్ష్యమని వాదిస్తున్నారు ఆయన. ఇండోచైనా యుద్ధం నుంచి బోస్ తప్పించుకున్నా 1947 డిసెంబర్ 11 వరకు ఆయన ఆచూకీ తెలియలేదు. అంటే 1945 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారనే వార్తలను ఫ్రెంచ్ ప్రభుత్వం ఎప్పుడూ ధ్రువీకరించలేదంటున్నారు మోరె.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy