కొత్త స్కీమ్ : ప్రైవేట్ కార్లూ షేర్ ట్యాక్సీలే!

private-taxiమీకో కారు.. ఎంచక్కా ఆఫీసులకు ఒక్కరే వెళుతున్నారు. నా కారు.. నా ఇష్టం అంటున్నారు. నిజమే కారు మీదే ఎవరూ కాదనరు. కాకపోతే 10కిలోమీటర్ల జర్నీకి బైక్ పై వెళితే ఎంత టైం పడుతుంది.. కార్లో వెళితే ఎంత టైం పడుతుందీ.. ఈ లెక్క మెట్రో నగరాల్లోని చాలా మందికి తెలిసే ఉంటుంది. రోజురోజుకు ట్రాఫిక్ పెరిగిపోతుండటంతో.. ప్రతి ఏటా లక్షల్లో రోడ్డెక్కుతున్న కార్లతో రద్దీ భయానకమైన స్థాయికి చేరిపోయింది.

ట్రాఫిక్ రద్దీ, జర్నీ టైం తగ్గించేందుకు కేంద్రం కొత్తగా ఓ ఆలోచన చేస్తోంది. వ్యక్తిగత (పర్సనల్) వెహికల్స్ ను షేర్ ట్యాక్సీలుగా ఉపయోగించుకోవటానికి అనుమతి ఇవ్వబోతున్నది. ఆర్థిక, పర్యావరణ అంశాలను తెలుసుకోవటానికి ఉబర్, ఓలా లాంటి సంస్థలను సంప్రదిస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం వ్యక్తిగత వాహనాలు – క్యాబ్స్ కు వేర్వేరు విధానాలు అమల్లో ఉన్నాయి. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే కార్లకు లైసెన్స్ ఫీజు అధికంగా ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ లు కూడా కఠినంగా ఉంటాయి. ఇన్సూరెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో చాలా మంది తమ వ్యక్తిగత వాహనాలను ట్యాక్సీలుగా నడపటానికి ఇవ్వరు. దీంతో వాటి కోసం మరో వాహనాలు కోనుగోలు చేస్తున్నారు. దీంతో రెండు రకాలుగానూ వాహనాల సంఖ్య బాగా పెరిగి.. ట్రాఫిక్ రద్దీ, జర్నీ టైం పెరుగుతుంది. అదే వ్యక్తిగత రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలనూ షేర్ ట్యాక్సీలుగా అనుమతి ఇస్తే వాహనాల సంఖ్యను నియంత్రిచొచ్చని భావిస్తోంది కేంద్రం. బీమ, భద్రత, నియంత్రణ లాంటి మూడు అంశాలను మూడు నెలలు పరిశీలించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రైవేట్ కార్లను షేర్ ట్యాక్సీలుగా ఉపయోగించటం వంటి మంచి ప్రయోజనాలు వస్తాయని ఉబర్, ఓలా లాంటి సంస్థలు చెబుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి విధానం ఆస్ట్రేలియా, సింగపూర్ లో ఉబర్ కు అక్కడి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.

దేశంలో ప్రతి వెయ్యి మందికి 20కార్లు ఉన్నాయి. ఈ సంఖ్య పెరగనుంది. కార్ల కంపెనీలపై ప్రభావం చూపనుంది. కార్పొరేషన్ సంస్థల పోటీతో ఇప్పటికే ట్యాక్సీ డ్రైవర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రైవేట్ కార్లనూ ట్యాక్సీలుగా మారటానికి అనుమతి ఇస్తే వాళ్ల ఉపాధిపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy