కొత్త స్టోరీలు కావాలి

New Storesఇద్దరు బడా హీరోలకు ఇప్పుడు స్టోరీలు కరువు అయ్యాయి. ఏ స్టోరీ చెప్పినా నచ్చటం లేదంట. కొత్తది.. కొత్తది కావాలని తెగ ఆరాటపడుతున్నారు. రీమేక్ లు వద్దని.. వెరైటీ, వైవిధ్యం ఉండాలని ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్టోరీ రైటర్స్, డైరెక్టర్స్ ఒకటికి నాలుగు కథలు చెప్పినా ఏ మాత్రం నచ్చలేదంట. వీళ్లద్దరూ ఎవరో కాదు.. ఒకరు మెగాస్టార్ చిరంజీవి, మరొకరు విక్టరీ వెంకటేష్. 150వ సినిమా కసరత్తుల్లో ఉన్న చిరు.. తమిళ కత్తి రీమేక్ కన్ఫామ్ అంటూ వార్తలు వచ్చాయి.. అయితే చివరకు కొత్త కథ కావాలని.. రీమేక్ వద్దని స్పష్టం చేసి.. కోన అండ్ టీంకు కథ బాధ్యతలు అప్పగించారు. వాళ్ల దగ్గర ఉన్న రెండు, మూడు కథలు చెప్పినా ఏ మాత్రం మెగాస్టార్ ను ఆకట్టుకోలేకపోయాయంట… స్టోరీ లైన్ డిఫరెంట్ గా ఉండాలని.. ప్రేక్షకుడు ఫీల్ గుడ్ అవ్వాలని.. అరే సూపర్బ్ అనే విధంగానే కథ ఉండాలని తన మనసులోని మాట చెప్పారంట.. దీంతో మెగాస్టార్ 150వ సినిమా కథ ఓ రేంజ్ లో తయారు చేసేందుకు కోన అండ్ టీం మాత్రమే కాదు.. కథ రచయితలు అందరూ తమ బుర్రలకు పదును పెడుతున్నారు.. ఇక విక్టరీ వెంకటేష్.. కూడా మేకప్ వేసుకుని ఎనిమిది నెలలుగా గడిచిపోయింది. ఇప్పటికే మారుతీ, దశరథ్, దేవకట్టా, క్రాంతి ఈ నలుగురు డైరెక్టర్స్ కథలు వినిపించారు. ఎవరి విషయంలోనూ సంత్రుప్తి వ్యక్తం చేయలేదు. కథలో దమ్ము ఉండాలని.. ఇంకా కసరత్తులు కావాలని చెప్పేశారంట. హిందీ పీకూ, మళయాళం భాస్కర్ ది రాస్కెల్ రీమేక్ చేద్దామని వెంకీ అనుకున్నా.. తెలుగు నేటివిటీకి అంత ఆకట్టుకోవని వెనకడుగు వేశారు. మొత్తంగా ఎనిమిదేళ్ల తర్వాత చిరు.. ఎనిమిది నెలల తర్వాత స్టార్ట్, యాక్షన్, రెడీకి కథల కొరత బాగా వేధిస్తోంది. చూడాలి.. అద్బుతమైన కథలు అందించే సత్తా తెలుగోళ్లలో ఉందా.. లేక అరువు తెచ్చుకుంటారా అనేది..

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy