కొనటానికేనా : ఈ ఫోన్ రేటు తెలిస్తే కళ్లుతిరుగుతాయ్

phoneఫోన్ వేలల్లో, లక్షలల్లోనే కాదు..కోట్ల ఖరీదు కూడా చేస్తుందటా.. బ్రిటన్‌కు చెందిన ఈ సంస్థ వర్చూ సిగ్నేచర్‌ కోబ్రా ఫీచర్‌ ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్‌ ధర 3.6లక్షల డాలర్లు. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 2.3కోట్లకు పైమాటే. ఇంత ధర ఉందంటే.. ఈ ఫోన్లో ఏమైనా వజ్రాలు పొదిగారా అనుకుంటున్నారా? అలాంటిదేనండీ, ఈ ఫోన్‌ తయారీలో 439 కెంపులను ఉపయోగించారట. అంతేగాక, పేరుకు తగ్గట్టుగా ఫోన్‌ చుట్టూ పాము బొమ్మను తీర్చిదిద్దారు. పాము కళ్లను పచ్చలతో పొదిగారు. ఈ ఫోన్‌ను యూకేలో తయారుచేశారు. ఇప్పటివరకు కేవలం 8 ఫోన్లను మాత్రమే సంస్థ రూపొందించినట్లు చైనాకు చెందిన ఓ మీడియా సంస్థ పేర్కొంది. ఇక ఫోన్‌ ఫీచర్లు ఇలా ఉన్నాయి.
.. 2 అంగుళాల డిస్‌ప్లే
.. 2 జీబీ రామ్‌
.. 16జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy