కొనసాగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Andhra---Assembly---EPSఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అసెంబ్లీ కమిటీ హాల్ లోని నెంబర్ వన్ హాల్ లో పోలింగ్ ప్రక్రియ నడుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అసెంబ్లీ ఏరియాలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. సాయింత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేల కోటాలో 6 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి కడియం, తుమ్మల, నేతి విద్యాసాగర్ రావు, యాదవరెడ్డి, వెంకటేశ్వర్లు బరిలో ఉండగా… కాంగ్రెస్ నుంచి ఆకుల లలిత, టీడీపీ నుంచి వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy