కొరటాల శివ దర్శకత్వంలో మహేష్

koratala_maheshకొరటాల శివ దర్శకత్వంలో ప్రముఖ నటుడు మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ అనే చిత్రంలో నటించబోతున్నారు. వీరిద్దరి కలయికలో ప్లాన్ చేసిన ఈ చిత్రం షూటింగ్ ఈరోజు నుండి చెన్నైలో మొదలవుతోంది. అయితే ఈ షూటింగ్లో మహేష్ పాల్గొనడంలేదు. మురుగదాస్ తో చేస్తున్న ‘స్పైడర్’ పూర్తైన తర్వాత మహేష్ ఈ షూటింగ్ లో పాల్గొంటారు.  అప్పటి వరకు కొరటాల ఇతర కీలక నటీనటులపై సన్నివేశాల చిత్రీకరణ చేయనున్నారు.

‘ భరత్ అనే నేను ‘ అనే సినిమాను 2018 జనవరి 11 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ ఏలాంటీ అధికార ప్రకటన వెలువడ లేదు. ఇకపోతే డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించనుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చేస్తున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy