‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ రివ్యూ

images (1)కొరియర్ బాయ్ కళ్యాణ్…ఇష్క్, గుండెజారిగల్లంతయ్యిందే,చినదాన నీకోసం సినిమాలతో దూకుడు మీదున్న నితిన్ తాజా మూవీ కొరియర్ బాయ్ కళ్యాణ్  రిలీజ్ అయ్యింది. డిపరెంట్ సబ్జెక్ట్ తో రిలీజైన కొరియర్ బాయ్ పై రివ్యూ.

 

 

 

images

 • కళ్యాణ్ (నితిన్).. బీఏ ఫెయిలై ఏ ఉద్యోగమూ దొరక్క సాదాసీదా జీవితం గడిపే ఓ యువకుడు.
 • ఉద్యోగాల వేటలో ఉన్నపుడే కళ్యాణ్, కావ్య (యామి గౌతమ్) అనే అమ్మాయిని చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి కోసమే ఓ కొరియర్ కంపనీలో కొరియర్ బాయ్‌గా చేరతాడు.
 •  ఈ క్రమంలోనే కళ్యాణ్, కావ్యలు ఒకరినొకరు రోజూ కలుసుకోవడం, ఆ తర్వాత ప్రేమలో పడతారు.
 • ఇదిలా ఉండగానే కళ్యాణ్ జీవితాన్ని అనుకోని మలుపులు తిప్పుతుంది.
 • విదేశాల్లో ఓ పెద్ద డాక్టర్ అయిన అశుతోష్ రానా… తన స్వలాభం కోసం ఒక పరిశోధన చేస్తాడు.
 •  ఆ పరిశోధనలో తమ లాభం కోసం ఇండియాలోని కొన్ని ఆసుపత్రుల్లో తన సీక్రెట్ ప్లాన్‌ను అమలుచేస్తుంటాడు.
 •  ఈ విషయాన్ని తెలుసుకున్న ఒక ఆసుపత్రిలో పనిచేసే వార్డు బాయ్ హైదరాబాద్ లో ఉండే సామాజిక కార్యకర్త అయిన సత్యమూర్తి (నాజర్)కు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక కొరియర్ చేస్తాడు.
 •  ఆ కొరియర్ చేరాల్సిన చోటుకు చేరిందా? అశుతోష్ చేసే అక్రమం బయటి ప్రపంచానికి తెలిసిందా? సీక్రెట్ రీసెర్చ్ ఏంటీ? అన్న ప్రశ్నలకు సమాధానమే ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’.

courier-boy-kalyan-movie-trailerనటీనటుల విషయానికి వస్తే..

 • హీరో నితిన్ పాత్ర అక్కడక్కడా గతంలో నితిన్ చేసిన పాత్రలు గుర్తు తెచ్చినా.. ఓవరాల్‌గా క్యారెక్టర్, సినిమా పరంగా నితిన్ ట్రై చేసిన డిఫరెంట్ అటెంప్ట్‌గా ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ నిలుస్తుందని చెప్పుకోవచ్చు.
 •  యామి గౌతమ్‌ అందం విషయంలో వంక పెట్టలేం. పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రలో ఉన్నంతలో బాగా నటించింది.
 •  ఇక నాజర్, అశుతోష్ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.సినిమా పరంగా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తాన్నీ సరదా సరదాగా లాగేసినట్లు కనిపిస్తుంది.
 • ఇంటర్వెల్ వరకూ సినిమా కథలోకి వెళ్ళకుండా లవ్‌ట్రాక్‌తోనే నడిపించారు. సెకండాఫ్‌లో కొద్దిసేపు సినిమా ఆసక్తికరంగా నడిచినా, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ వచ్చేసరికి సినిమాను చుట్టేసిన ఫీలింగ్ కలుగుతుంది.
 • కొత్త కథనే స్క్రీన్‌ప్లే ద్వారా కట్టిపడేసే విషయంలో మాత్రం దర్శకుడు ప్రేమ్ సాయి చాలా చోట్ల విఫలమయ్యాడు.
 • కార్తీక్, అనూప్ రూబెన్స్ అందించిన మ్యూజిక్ బాగుంది. బంగారమా పాట వెంటనే రిజిస్టర్ అయిపోతుంది. సందీప్ చౌతా అందించిన బ్యాక్‌గ్రౌడ్ స్కోర్ కూడా ఆకట్టుకునేలా ఉంది.
 •  సినిమాటోగ్రాఫర్ పనితనం బాగుంది. ఎడిటింగ్ విషయంలో సినిమా ఇంకా బాగా ఉండాల్సింది. నెరేషన్‌ను మరింత అందంగా చూపాల్సిన సన్నివేశాల్లో ఎడిటింగ్ సాదాసీదాగా ఉంది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy