కొలంబియాలో విషాదం.. నీట మునిగిన పడవ

sunk-boat-2కొలంబియాలో భారీ పడవ నీటిలో మునిగింది. ఆ పడవలో 150 మంది ప్రయాణికులు ఉన్నారు. వాయివ్య కొలంబియాలో పర్యాటక నగరమైన గువాతపేలోని ఓ జలాశయంలో ఈ ప్రమాదం జరిగినట్లు వైమానికదళం వెల్లడించింది. ఈ దుర్ఘటనలో 9 మంది మృతి చెందగా, 30 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన వైమానిక దళం సహాయక చర్యలు చేపట్టి పలువురిని రక్షించి ఆసుపత్రికి తరలించింది. మెడ్లిన్‌కు 68 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలాశయంలో ఈ  ప్రమాదం జరిగింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy