కొలంబోలో మనోళ్లదే హవా

colombo-matchకొలంబో టెస్టులో పట్టు పెంచింది టీమిండియా. రెండో రోజూ ఆటలో పైచేయి సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 622/9 పరుగులు దగ్గర డిక్లేర్ చేసింది. ఓవర్‌ నైట్‌ స్కోరు 344/3 వద్ద రెండో రోజు ఆట ప్రారంభించిన కోహ్లీసనే మరో 5 పరుగులకే ఛటేశ్వర్ పుజారా(133) వికెట్ కోల్పోయింది.  కరుణరత్నె బౌలింగ్‌లో ఔటయ్యాడు. అజింక్య రహానె (132) కాసేపు మాత్రమే నిలిచాడు. ఐతే 111వ ఓవర్‌లో పుష్పకుమార బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. తర్వాత రవిచంద్రన్‌ అశ్విన్‌ (54), యువ ఆటగాడు హార్దిక్‌ పాండ్యా (20)తో కలిసి ఇన్నింగ్స్‌ కొనసాగించాడు. 91 బంతుల్లోనే 11వ అర్ధశతకం బాది డబుల్‌ రికార్డు సాధించాడు. టెస్టుల్లో 2000 పరుగులు, 200 వికెట్లు తీసిన నాలుగో భారతీయుడిగా నిలిచాడు. టెస్టు చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయి దాటిన నాలుగో క్రికెటర్‌గా ఘనతకెక్కాడు. 122వ ఓవర్‌లో హెరాత్‌ బౌలింగ్‌లో 451 పరుగుల వద్ద బౌల్డయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా (67).. పాండ్యా ఔటైనా తన సమయోచిత ఇన్నింగ్స్‌తో టీమిండియా స్కోరును 500 దాటించాడు. పాండ్యా అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రవీంద్ర జడేజా (70 నాటౌట్‌) చూడచక్కని షాట్లతో అలరించాడు. భారీ బౌండరీలు, సిక్సర్లు బాదాడు. చక్కని అర్ధశతకం సాధించి స్కోరు 600 దాటించాడు. అతడికి షమి (19; 8 బంతుల్లో 1×4, 2×6) తోడయ్యాడు. వరుసగా రెండు సిక్సర్లు బాది స్కోర్‌ వేగం పెంచాడు. మూడో సిక్సర్‌ బాదే ప్రయత్నంలో తరంగ చేతికి చిక్కాడు. చివరికి ఉమేశ్‌ యాదవ్‌ (8 నాటౌట్‌)తో కలిసి జడేజా ఇన్నింగ్స్‌ ముగిసే వరకు క్రీజులో నిలిచాడు. 158 ఓవర్లకు 622 పరుగుల వద్ద కోహ్లీ ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు.

లంక బౌల‌ర్ల‌లో హెరాత్ 4, పుష్ప‌కుమార 2 వికెట్లు తీసుకున్నారు. ఆ త‌ర్వాత తొలి ఇన్నింగ్స్ మొద‌లుపెట్టిన శ్రీలంక‌.. ప‌రుగుల ఖాతా తెర‌వ‌క‌ముందే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెన‌ర్ త‌రంగ డ‌కౌట‌య్యాడు. రికార్డుతో ఊపు మీదున్న అశ్వినే ఈ వికెట్ తీసుకున్నాడు. చండీమాల్ 8, మెండీస్ 16 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy