కొలంబో టెస్టు : లంకపై భారత్ ఘన విజయం..సిరీస్ కైవసం

51502010911_625x300మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో భారీ విజయం సాధించిన భారత జట్టు సిరీస్ ను  కైవసం చేసుకుంది.  రెండోఇన్నింగ్స్ లో శ్రీలంకను 386 పరుగుల వద్ద ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ 53 పరుగుల తేడాతో భారత్ విజయాన్ని అందుకుంది. దాంతో సిరీస్ ను ఇంకా టెస్టు మ్యాచ్ మిగిలిఉండగానే 2-0తో చేజిక్కించుకుంది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో కుశాల్ మెండిస్(110;135 బంతుల్లో17 ఫోర్లు), దిముత్ కరుణరత్నే(141; 307 బంతుల్లో 16 ఫోర్లు)లు మినహా ఎవరూ రాణించలేదు. భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించగా, అశ్విన్, హార్దిక్ పాండ్యాలు తలో రెండు వికెట్లు సాధించారు. ఉమేశ్ కు వికెట్ దక్కింది.

209/2 ఓవర్ నైట్ స్కోరుతో ఆదివారం రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన లంకేయులు స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డారు. జట్టు స్కోరు 238 పరుగుల వద్ద మలిందా పుష్పకుమార(16) వికెట్ ను కోల్పోయిన శ్రీలంక. . ఆపై మూడు పరుగుల వ్యవధిలో కెప్టెన్ దినేశ్ చండిమాల్(2) వికెట్  ను సైతం చేజార్చుకుంది.  పుష్పకుమారను అశ్విన్ బౌల్డ్ చేస్తే, జడేజా బౌలింగ్ లో రహానేకు క్యాచ్ ఇచ్చి చండిమాల్ అవుటయ్యాడు. వీరిద్దరూ లంచ్ లోపే అవుట్ కావడంతో శ్రీలంక ఓటమి దిశగా పయనించింది. ఆపై వచ్చిన ఆటగాళ్ల భారత బౌలింగ్ ను ఎదుర్కోలేక చతికిలబడ్డారు.  జట్టు స్కోరు 310 పరుగుల వద్ద కరుణరత్నే ఐదో వికెట్ గా అవుటయ్యాడు. ఆపై కాసేపటికి ఏంజెలో మాథ్యూస్(36) నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ దెబ్బకు విలవిల్లాడిన  లంకేయులు.. రెండో ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజాకు చిక్కారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 183 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy