కొవ్వు తోడేస్తుందా, ప్రాణాలు తోడేస్తుందా?

liposuctionలైపోసక్షన్.

కొవ్వును కరిగించేందుకు షార్ట్ కట్ మెథడ్. స్థూలకాయాన్ని తగ్గించేందుకు చాలామంది ప్రిఫర్ చేసే ట్రీట్ మెంట్. షార్ట్ టైంలోనే అగ్రహీరోలతో నటించి.. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే తెరమరుగైంది ఆర్తి అగర్వాల్. ఓ తెలుగు హీరోతో లవ్ ఎఫైర్.. రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్. 31 ఏళ్లలోనే ఎన్నో అప్స్ డౌన్స్ ను చూసింది ఆర్తి అగర్వాల్. ఈ మధ్యే నీలవేణి సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. అమ్మ రాజశేఖర్ ‘రణం-2’కి సైన్ చేసిన ఆర్తి అగర్వాల్.. కొన్నాళ్లుగా బరువు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతోందని సమాచారం. వెయిట్ తగ్గి సెకెండ్ ఇన్నింగ్స్ లో  సత్తాచాలని  లైపోసక్షన్ వైపు మొగ్గుచూపిందట. చివరికి అదే ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది.

ఒంట్లో 15 లీటర్ల కొవ్వును మాత్రమే తొలగించడానికి వీలయ్యే ఆపరేషన్ లైపోసక్షన్. అంతకంటే ఎక్కువ ఫ్యాట్ ఉంటే బెరియాట్రిక్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. అది వెరీ డేంజర్. ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు. మూడు నెలల నుంచి ఏడాది టైం పట్టొచ్చు. బెరియాట్రిక్ సర్జరీతో పోలిస్తే లైపోసక్షన్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్. అమెరికా లాంటి దేశాల్లో 90 శాతం సక్సెస్ రేటుంది. కానీ ఆ ట్రాక్ రికార్డ్ ఆర్తిని కాపాడలేకపోయింది.

లైపోసక్షన్  అంటే 3-4 మిల్లిమీటర్ల రంధ్రాలు చేసి చర్మం కింద ఉన్న కొవ్వును ద్రవరూపంలో తీసే పద్ధతి. ఇది పూర్తిగా కాస్మొటిక్  సర్జరీ. లైపోసక్షన్  ప్రక్రియలో మూడు దశలుంటాయి. శరీరంలో కొవ్వు ద్రవరూపంలో ఉండదు. దాన్ని లైపోసక్షన్ లో లిక్విడ్ గా మార్చి హోల్ ద్వారా బయటికి తీస్తారు. కొవ్వుపొరల్లోకి నార్మల్  సెలెన్ (ఎన్ ఎస్ ) ఎక్కించడంతో అది నీటిలో ముంచిన స్పాంజిలా తయారవుతుంది. దానివల్ల కొవ్వు పొరలు వేరవుతాయి. రక్తస్రావం జరగకుండా ఉంటుంది. ఇది పూర్తిగా సేఫ్. ఇది మొదటి దశ.

రెండోదశలో… కొవ్వును చేతితో కాన్యులా సాయంతో, అల్ట్రాసోనిక్  తరంగాల ద్వారా కరిగించి ద్రవరూపంలోకి మారుస్తారు. అల్ట్రాసోనిక్  తరంగాలతో బాడీలో దీర్ఘకాలిక మార్పులు రావు. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని పరిశోధనల్లో తేలింది. ప్రెగ్నెన్సీలో చేసే అల్ట్రా సౌండ్  స్కాన్ లానే ఉంటుంది. మూడో దశలో అల్ట్రాసోనిక్  పద్ధతి ద్వారా ద్రవరూపంలోకి మారిన కొవ్వును సక్షన్  పంప్  సాయంతో బయటకు లాగుతారు.

బాడీలో ఫ్యాట్ తక్కువ ఉంటే.. ఒక్కరోజులోనే డిస్ఛార్జ్ అవొచ్చు. ఒకవేళ ట్రీట్ మెంట్ ఫెయిలైనా హాస్పిటల్ లో చేరితే ప్రాణాలు నిలబెట్టే అవకాశముంటుంది. నిజానికి లైపోసక్షన్ పూర్తిగా నిపుణులైన వైద్యులు చేయాల్సిన ట్రీట్ మెంట్. ఆర్తి అగర్వాల్ విషయంలో విధి వక్రించింది. ట్రీట్ మెంట్ పూర్తై ఇంటికి చేరిన ఆర్తికి కడపు నొప్పి వచ్చిందని సమాచారం. అంబులెన్స్ 15 మినిట్స్ లేట్. ఇన్ టైంలో హాస్పిటల్ కు వెళ్లలేకపోవడం ఒక కారణమైతే… డాక్టర్ ట్రీట్ మెంట్ సరిగా చేయలేదన్నది మరో రీజన్. డాక్టర్ పై కేసు పెట్టేందుకు ఆర్తీ పేరెంట్స్ రెడీ అయ్యారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy