కోచ్ పదవి రేసులో వెంకటేశ్ ప్రసాద్

VENKATESHభారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ పదవికి తాజాగా మాజీ బౌలింగ్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్ పోటీ పడుతున్నారు. భారత జట్టు కోసం విశేష సేవలు అందించిన ఈ పేస్ దిగ్గజం కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రసాద్‌ జూనియర్‌ నేషనల్‌ చీఫ్‌ సెలక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబరులో తన పదవి కాలం పూర్తి కానుండటంతో ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. రవిశాస్త్రి, ప్రసాద్‌ ఇద్దరికీ టీమిండియా డైరెక్టర్లుగా పనిచేసిన అనుభవం ఉంది.  2007 నుంచి 2009 వరకు టీమిండియాకి బౌలింగ్‌ కోచ్‌గా పని చేసిన ప్రసాద్‌ ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టుకి బౌలింగ్‌ కోచ్‌గా సేవలు అందించాడు. భారత్‌ తరఫున ఆయన 33 టెస్టులు, 161 వన్డేలు ఆడారు. ఇప్పటికే కోచ్‌ రేసులో రవిశాస్త్రి, సెహ్వాగ్‌, టామ్‌మూడీ, దొడ్డ గణేశ్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ ఉన్నారు. తాజాగా వెంకటేశ్‌ ప్రసాద్‌ కూడా రేసులోకి రావడంతో కోచ్‌ ఎంపిక ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy