కోటి కోట్లు సంపాదించిన ఆ 62 మంది

MAIN-62-v6ప్రపంచంలోని సంపద ఎక్కువ ఎవరి చేతుల్లో ఉందో తెలుసా? పోనీ ఎంత మంది చేతిలో ఉందో తెలుసా? ఈ విషయంపై క్లారిటీ తెచ్చేందుకు.. ఆక్స్ ఫామ్ అనే హక్కుల సంఘం సర్వే చేసింది. వాల్డ్ వైడ్ గా అత్యంత సంపన్నుల ఆస్తి విలువ లెక్కగట్టింది. ఈ సర్వేతో ఆశ్చర్యపోయే ఫలితాలు బయటికొచ్చాయి. ఆ డిటెయిల్స్ పై ఓ కథనం….

ప్రపంచ సంపద ఎక్కువగా ఎవరి చేతుల్లో ఉందో తేలిపోయింది. వాల్డ్ వైడ్ గా.. సగం జనాభా చేతుల్లో ఉన్న సంపద కంటే.. 62 మంది కుబేరుల ఆధీనంలో ఉన్న ఆస్తి ఎక్కువని స్పష్టమైంది. 2010 నుంచి ఆ 62 మంది ఆస్తి.. దాదాపు సగం కంటే ఎక్కువ పెరిగి… కోటి 19 లక్షల 15 వేల 983 కోట్ల రూపాయలకు చేరింది. ఇదే టైమ్ లో.. సగం ప్రపంచ జనాభా ఆస్తి 41 శాతం తగ్గి.. 67 లక్షల 70 వేల 445 కోట్ల రూపాయలకు తగ్గింది. ఈ విషయంపై… ఆక్స్ ఫామ్ అనే హక్కుల సంస్థ సర్వే చేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక దీనిపై రిపోర్ట్ రిలీజ్ చేసింది.

ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక ప్రకారం.. కొద్ది మంది వ్యక్తుల దగ్గర కూడుతున్న సంపద.. ఏటా పెరుగుతూ పోతోంది. ఇదే కారణంతో.. 2010లో అత్యంత సంపన్నుల సంఖ్య 388 మందిగా ఉంటే.. 2015 వచ్చే సరికి 62కు పడిపోయింది. ధనిక, పేదల మధ్య ఆస్తులు, సంపదల్లో ఉన్న తేడా ఏ స్థాయిలో ఉందో.. ఆర్థిక వేదిక రిపోర్ట్ తో తేలిపోయింది. ఈ పరిస్థితిలో మార్పు రాకుంటే.. ఆర్థిక ప్రగతికి అర్థం లేకుండా పోతుందని WEF కామెంట్ చేసింది.

మన దేశంలో పరిస్థితిపైనా.. సర్వేలో ఎంక్వైరీ చేశారు. ఓ టాప్ ఐటీ కంపెనీ సీఈవో జీతం.. అదే సంస్థలోని మామూలు ఉద్యోగి జీతం కంటే 416 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది. అయితే.. కంపెనీల సీఈవోలకు చెల్లించే జీతాన్ని బహిరంగంగా చెప్పడం కోసం.. 2013లో చట్టం తీసుకురావడాన్ని ప్రశంసించింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy