కోదండరామ్ అరెస్ట్

kodandaram-arrestజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ ను అరెస్టు చేశారు పోలీసులు. తెల్లవారు జామున నాలుగు గంటల సమయంలో హైదరాబాద్ తార్నాకలోని ఆయనింటికెళ్లి ముందస్తుగా అరెస్టు చేశారు. ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు కోదండరామ్ ఇంటిని చుట్టుముట్టారు. ప్రీవెంటివ్ అరెస్టుకు సహకరించాలని పోలీసులు కోరినా.. కోదండరామ్ అండ్ కో సహకరించలేదు. దీంతో ఆయన ఇంటి బలవంతంగా తెరిచారు పోలీసులు.

కోదండరాంతో పాటు.. సహా మరో 25 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడ్నుంచి కంచన్ బాగ్ స్టేషన్ కు తరలించారు. కోదండరామ్ ఇంటి పరిసరాల్లోకి ఎవర్ని రాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  శాంతి భద్రతలు దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా కోదండరాంతో సహా ఆయన సహచరులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు డీసీపీ రవీందర్. అందరినీ సాయంత్రం వదిలేస్తామన్నారు. ఇందిరాపార్కు సహా నగరంలో ఎక్కడా ర్యాలీలకు అనుమతి లేదని.. నిరసనల కోసం ఎవరూ హైదరాబాద్ కు రావద్దని సూచించారు.

మరోవైపు జిల్లాల్లోని అన్ని ప్రధాన రహదారులపై తనిఖీలు చేస్తున్నారు. జిల్లాల నుంచి బయల్దేరిన విద్యార్థి సంఘాల నేతలను ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. హైదరాబాద్ కు చేరుకునే రహదారుల పై చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు. అన్ని బస్సులను తనిఖీ చేస్తున్నారు. నిరుద్యోగ నిరసన ర్యాలీకి పర్మిషన్ లేనందున ఎవరూ సిటీకి రావద్దని హెచ్చరించారు పోలీసులు. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ప్రైవేట్ వాహనాల్లో వెళితే వాటిని కూడా సీజ్ చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy