కోర్టులో ASI మోహన్ రెడ్డి అనుచరుల హల్ చల్

asi mohanreddyవడ్డీ వ్యాపారం కేసులో నిందితుడిగా ఉన్న ఏఎస్సై మోహన్ రెడ్డిని.. పోలీసులు గురువారం  కోర్టులో హాజరుపరిచారు. ఈ సమయంలో.. మోహన్ రెడ్డి బంధువులకు, లాయర్లకు మధ్య ఘర్షణ జరిగింది. మోహన్ రెడ్డిని కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో… గొడవ మొదలైనట్టు లాయర్లు చెబుతున్నారు. తమపై దుర్భాషలాడుతూ దాడికి దిగారని చెప్పారు. ఓ నిందితుడిని అనుమతి లేకుండా కలిసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారంటూ.. మోహన్ రెడ్డి అనుచరులపై… పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా జడ్జి దృష్టికీ ఈ విషయం తీసుకెళ్తామన్నారు. మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా చర్యలు తీసుకోవాలని కోరతామని చెప్పారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy