కోర్టు సంచ‌ల‌న తీర్పు: శాన్విని చంపిన వాడికి మ‌ర‌ణ‌శిక్ష‌

raghu2012లో అమెరికాలో శాన్వి అనే చిన్నారిని, ఆమె అమ్మమ్మ‌ను హ‌త్యకు గురైన‌ సంఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ర‌ఘునంద‌న్‌కు మ‌ర‌ణ‌శిక్ష విధించింది అమెరికా కోర్టు. పెన్సిల్వేనియాలో నివాస‌ముంటున్న శాన్వి ఆమె అమ్మ‌మ్మ స‌త్య‌వ‌తిని 2012లో వారుండే అపార్ట్‌మెంటులోనే హ‌త్య చేశాడు ర‌ఘునంద‌న్‌. విలాసాల‌కు అల‌వాటు ప‌డే ర‌ఘునంద‌న్ ఈ ఘాతుకానికి పాల్ప‌డ్డాడంటూ జ్యూరీ 2012లో అత‌నిని దోషిగా ప్ర‌క‌టించింది. 2015లో ర‌ఘునంద‌న్‌కు కింది కోర్టు మ‌ర‌ణ‌శిక్ష విధించింది. ఈ కేసును విచారించిన‌ పెన్సిల్వేనియా హైకోర్టు కింది కోర్టు తీర్పును స‌మ‌ర్థిస్తూ మ‌ర‌ణ‌శిక్ష విధించింది.
2012లో ఒక వృద్దురాలు హ‌త్య‌కు గురైంద‌ని..చిన్నారిని ఎవ‌రో కిడ్నాప్ చేశార‌న్న స‌మాచారం అంద‌టంతో పోలీసులు నిందితుడి కోసం వేట కొన‌సాగించారు. హ‌త్య జ‌రిగిన ప్రాంతంలో ఓ నోట్ పోలీసులకు దొరికింది. శాన్వి కావాలంటే 50వేల డాల‌ర్లు ఇవ్వాల‌ని ఆ లేఖ‌లో రాసి ఉంది. అంతేకాదు అతి కొద్ది మందికి తెలిసిన శాన్వి త‌ల్లిదండ్రుల ముద్దు పేర్లు ఆ లేఖ‌లో ప్ర‌స్తావించ‌డంతో ఆదిశ‌గా విచార‌ణ చేశారు పోలీసులు . ర‌ఘునంద‌న్‌పై అనుమానం రావ‌డంతో ఆయ‌న్ను త‌మ‌దైన ప‌ద్ధ‌తిలో విచార‌ణ చేయ‌గా వృద్దురాల‌ని, శాన్విని త‌నే చంపిన‌ట్లు ఒప్పుకున్నాడు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy