కోర్టు హాలులో జడ్జి ముందే కాల్పులు

court-firingఢిల్లీ కోర్టులో కలకలం.. తూర్పు ఢిల్లీలోని కర్కర్దూమ కోర్టులో న్యాయమూర్తి ముందే కాల్పులు జరిపారు దుండగులు. కోర్టు హాలులోకి నిందితున్ని తీసుకువస్తుండగా పోలీసులపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రామ్ కుమార్ అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే చనిపోయాడు. మూడు బుల్లెట్లు రామ్ కుమార్ శరీరంలోకి చొచ్చుకుపోయాయి. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని స్థానిక హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఈ ఇన్సిడెంట్ కు ముఠాల తగాదాలే కారణమని భావిస్తున్నారు.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy