214 కోల్ బ్లాక్ లను రద్దు చేసిన సుప్రీం కోర్టు..

24col2కోల్ బ్లాక్ ల కేటాయింపులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కోల్ బ్లాక్ ల కేటాయింపులు సరికాదని… ఏకపక్షంగా కేటాయింపులు జరిగాయని విమర్శించింది. 1993 తర్వాత కేటాయించిన కోల్ బ్లాక్ ల  లైసెన్సులను రద్దు చేసింది. 2010 వరకూ జరిగిన అన్ని కేటాయింపులను క్యాన్సిల్ చేసింది. కోల్ బ్లాక్ లపై సీబీఐ ఎంక్వైరీ కంటిన్యూ అవుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్ధల ఆధ్వర్యంలో నడిచే 4 కోల్ బ్లాక్ లను మినహాయిస్తూ తీర్పు ఇచ్చింది. రద్దు చేసిన 214 కోల్ బ్లాక్ లను తిరిగి వేలం వేసుకొనే అవకాశాన్ని కల్పించింది. కోల్ బ్లాక్ ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న కాగ్ నివేదికను సుప్రీం కోర్టు సమర్ధించింది. కోల్ బ్లాక్ ల కేటాయింపులో లక్షా 86 వేల కోట్లు అవినీతి జరిగిందని కాగ్ రిపోర్ట్ చెప్తోంది.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy