కోసేసిన అమ్మాయికి సీఎం అభినందనలు

keralaఏడేళ్లుగా త‌న‌పై అత్యాచారం చేస్తున్న ఓ స‌న్యాసికి స‌రైన బుద్ధి చెప్ప‌డాన్ని హ‌ర్షించారు కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌రాయి విజ‌య‌న్‌. త‌ను 15 ఏళ్ల వ‌య‌సున్న‌ప్పుడు త‌న తండ్రి ప‌క్ష‌పాతం వ‌చ్చి మంచానికి ప‌రిమితం కావ‌డంతో త‌ల్లి స్థానిక ప‌న్మ‌నా ఆశ్ర‌మం నుంచి పూజ‌లు నిర్వ‌హించేందుకు ఓ స‌న్యాసిని ఇంటికి పిలిచింద‌ని చెప్పింది ఆ యువ‌తి. పూజ‌ల పేరుతో ఇంటికి వ‌చ్చి త‌న‌ను లైంగికంగా వేదించి అత్యాచారం చేసేవాడ‌ని తెలిపింది. అప్పుడు చాలా భ‌య‌ప‌డేదాన్న‌ని చెప్పిన యువ‌తి… గ‌త శుక్ర‌వారం కూడా త‌న‌ను అత్యాచారం చేయ‌బోగా అత‌ని అంగాన్ని కోసేసిన‌ట్లు పోలీసులకు తెలిపింది.

ర‌క్త‌పు మ‌డుగులో ప‌డివున్న స‌న్యాసిని ఆ యువ‌తి కుటుంబ‌స‌భ్యులు తిరువ‌నంత‌పురం మెడిక‌ల్ కాలేజీలో చికిత్స కోసం త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు. ఏడేళ్ల క్రితం నుంచే త‌న‌ను అత్యాచారం చేస్తున్న‌ట్లు ఫిర్యాదులో యువ‌తి పేర్కొనగా… ఆ స‌మ‌యంలో ఆమె మైన‌ర్‌గా ఉండ‌టంతో పాస్కో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. స‌న్యాసి అత్యాచారం చేస్తున్నాడ‌ని త‌ల్లికి కూడా తెలిసి ఆ దుర్మార్గాన్ని అడ్డుకోక‌పోవ‌డంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

స‌న్యాసిపై ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని సీఎం పిన‌రాయి విజ‌య‌న్‌ను అడ‌గ్గా… ఆ యువ‌తి విధించిన శిక్ష కంటే ఇంకా పెద్ద శిక్ష ఏముంటుంద‌ని ఆయ‌న అన్నారు. ఆత్మ‌రక్ష‌ణ‌లో భాగంగానే యువ‌తి స‌న్యాసిపై దాడి చేయ‌డంతో ఎలాంటి కేసు న‌మోదు చేయ‌లేద‌ని పోలీసులు వెల్ల‌డించారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy