కోహ్లి ఆరాధ్య క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా..?

virat-kohli-rahul-dravidటీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఆరాధ్య క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌తో క‌లిసి తీసుకున్న ఫోటోను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే ఆ ఫోటో ఇప్ప‌టిది కాదు. విరాట్ చిన్న‌ప్పుడు రాహుల్‌తో దిగిన ఫోటో. ఎనిమిదేళ్ల క్రితం విరాట్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ త‌ర్వాత టెస్టులోకి ఎంట‌ర్ అయ్యేందుకు మూడేళ్ల స‌మ‌యం ప‌ట్టింది. స‌చిన్ త‌ర్వాత ఎవ‌రు అనుకుంటున్న స‌మ‌యంలో విరాట్ రూపంలో టీమిండియాకు ఓ అద్భుత‌మైన ఆట‌గాడు దొరికాడు.
చిన్న‌త‌నంలో రాహుల్‌ను ద‌గ్గ‌ర‌గా చూస్తే చాల‌నుకునేవాడిని… కానీ ఏకంగా రాహుల్ ద్రావిడ్ త‌న‌ను ఇంట‌ర్య్వూ చేస్తాడ‌ని ఊహించ‌లేద‌ని కోహ్లీ ఆ పోస్ట్‌లో రాశాడు. 2014లో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ సంద‌ర్భంగా కోహ్లీ రెండు సెంచ‌రీలు చేశాడు. ఆ మ్యాచ్‌తో టెస్ట్ సిరీస్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy