కోహ్లీకి ఖేల్ రత్న.. హిమదాస్ కు అర్జున.. క్రీడా పురస్కార విజేతలు వీళ్లే

ఢిల్లీ : 2018 జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర యువజన, క్రీడా శాఖ ప్రకటించింది. మణిపూర్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీలకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం దక్కింది.

ద్రోణాచార్య అవార్డుల విజేతలు – 8 

బాక్సింగ్ కోచ్ సుబేదార్ చెనంద అచ్చయ్య కుట్టప్ప, వెయిట్ లిఫ్టింగ్ కోచ్ విజయ్ శర్మ, తెలుగువాడు అయిన టేబుల్ టెన్నిస్ కోచ్ ఆచంట శ్రీనాసరావు – వీఆర్ బీడు, అథ్లెటిక్స్ కోచ్ సుఖ్ దేవ్ సింగ్ పన్ను, హాకీ కోచ్ క్లారెన్స్ లోబో, క్రికెట్ లో లైఫ్ టైమ్ అందించిన సేవలకు గాను తారక్ సిన్హా, జూడో కోచ్ జివాన్ కుమార్ శర్మలకు ద్రోణాచార్య అవార్డు ప్రకటించారు.

అర్జున అవార్డ్ విజేతలు… 20
ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో గోల్డ్ మెడల్ గెల్చుకున్న అథ్లెట్ నీరజ్ చోప్రా, పరుగుల రాణి హిమదాస్, అథ్లెట్ నయిబ్ సుబేదార్ జిన్సన్ జాన్సన్, హైదరాబాద్ కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ నేలకుర్తి సిక్కిరెడ్డి, బాక్సింగ్ ప్లేయర్ సుబేదార్ సతీష్ కుమార్, ఫిమేల్ క్రికెటర్ స్మృతి మందానా, గోల్ఫ్ ప్లేయర్ శుభాంకర్ శర్మ, హాకీలో మన్ ప్రీత్ సింగ్, సవిత, పోలో ప్లేయర్ రవి రాథోడ్, షూటర్ రాహి సర్నోబాత్, షూటర్ అంకూర్ మిట్టల్, షూటర్ శ్రేయాసి సింగ్, టేబుల్ టెన్నిస్ మనికా బత్రా, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సాథియన్, టెన్నిస్ ప్లేయర్ రోహన్ బొపన్న, రెజ్లర్ సుమిత్, వుషు ప్లేయర్ పూజా కడియన్, పారా అథ్లెట్ అంకుర్ ధమా, పారా బ్యాండిటన్ ప్లేయర్ మనోజ్ సర్కార్ లకు అర్జున అవార్డ్ దక్కింది.
ధ్యాన్ చంద్ పురస్కార గ్రహీతలు.. 4 
ఆర్చరీలో సత్యదేవ్ ప్రసాద్, హాకీలో భరత్ కుమార్ ఛెత్రి, అథ్లెట్ బాబీ అలోయ్ సియస్, రెజ్లింగ్ లో చౌగాలే దబు దత్తాత్రేయ్ లకు ధ్యాన్ చంద్ పురస్కారం గెల్చుకున్నారు.

ముగ్గురికి రాష్ట్రీయ ప్రోత్సాహన్ పురస్కారాలు, ఒకరికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ పురస్కారం ప్రకటించారు.

సెప్టెంబర్ 25వ తేదీన రాష్ట్రపతి భవన్ లో పురస్కారాలు విజేతలకు అందచేయనున్నారు. రాజీవ్ ఖేల్ రత్న విజేతలకు రూ.ఏడున్నర లక్షలు, అర్జున, ధ్యాన్ చంద్, ద్రోణాచార్య అవార్డీలకు రూ.ఐదు లక్షలు, ఇంటర్ యూనివర్సిటీల్లో ప్రతిభ చూపిన వారికి రూ.10లక్షల ప్రైజ్ మనీ, ప్రశంసా పత్రం, ట్రోపీ అందజేస్తారు.

క్రీడల్లో ప్రతిభ చూపించిన ఆటగాళ్లకు ఏటా అవార్డులు ప్రదానం చేస్తుంటుంది సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్ట్రీ. ఆటల్లో గడిచిన నాలుగేళ్లలో విశేషమైన ప్రతిభ చూపించిన ప్లేయర్స్ కు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం ప్రకటిస్తారు. నాలుగేళ్లలో నిలకడగా రాణించిన వారికి అర్జున అవార్డు అందిస్తారు. అంతర్జాతీయ టోర్నీల్లో పురస్కారాలు సంపాదించేలా ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చిన కోచ్ లకు ద్రోణాచార్య పురస్కారం ప్రదానం చేస్తారు. క్రీడల అభివృద్ధికి కృషిచేసిన వారికి ధ్యాన్ చంద్ అవార్డ్ ఇస్తారు. క్రీడల ప్రోత్సాహానికి సహాయం చేసిన వారికి.. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం అందజేస్తారు. ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లలో టాప్ పెర్ఫామెన్స్ చూపించిన వారికి.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ ఇస్తుంటారు.
ఈ ఏడాది పలు పురస్కారాలను ఎక్కువ ఆటగాళ్లు పోటీలో నిలిచారని క్రీడాశాఖ తెలిపింది. మాజీ ఒలింపియన్లు, అర్జున అవార్డీలు, ద్రోణాచార్య, ధ్యాన్ చంద్ పురస్కార గ్రహీతలు, క్రీడాశాఖ నిపుణులతో కూడిన అవార్డుల కమిటీ పురస్కార విజేతలను ఎంపిక చేశారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy