కోహ్లీ నెగ్గుతాడా: కోచ్ పదవికి రవిశాస్త్రి దరఖాస్తు

RAVI SHASTRIభారత క్రికెట్‌ టీమ్‌ కోచ్‌ పదవికి…టీమ్ మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి దరఖాస్తు చేసుకున్నారు. ఈ పదవిలో కొనసాగిన అనిల్‌ కుంబ్లే… ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత కోచ్ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు BCCI దరఖాస్తులు ఆహ్వానించింది.

భారత జట్టు సారథి విరాట్ కోహ్లీ కూడా రవిశాస్త్రి వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. మే నెలలో BCCI మొదటిసారి దరఖాస్తులు ఆహ్వానించగా టామ్‌మూడీ, సెహ్వాగ్‌ రేసులో నిలిచారు. మరిన్ని దరఖాస్తులు కోసం బీసీసీఐ రెండో సారి కుంబ్లే రాజీనామా తర్వాత దరఖాస్తులు ఆహ్వానించి జులై 9లోగా దరఖాస్తులు సమర్పించాలని తెలిపింది. ఇంటర్వ్యూకి రవిశాస్త్రి సిద్ధపడినా కోచ్‌ పదవి దక్కడం తేలికేమీ కాదు. ఎందుకంటే కిందటిసారి క్రికెట్‌ సలహా మండలిలో సభ్యుడైన గంగూలీతో రవిశాస్త్రికి గొడవ జరగడమే. స్కైప్‌ ద్వారా రవిశాస్త్రి ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో గంగూలీ లేడు. ఆ తర్వాత రవిశాస్త్రి వ్యక్తిగతంగా క్రికెట్‌ సలహా కమిటీ ముందుకు హాజరుకానందుకే అభ్యర్థిత్వాన్ని తిరస్కరించినట్లు గంగూలీ తెలిపాడు. తాజాగా కోచ్‌ పదవి కోసం దరఖాస్తులు పంపిన వారికి గంగూలీ, లక్ష్మణ్‌, సచిన్‌తో కూడిన క్రికెట్‌ సలహా మండలి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy