కోహ్లీ రికార్డ్ : ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన తొలి భారత కెప్టెన్

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో పలు రికార్డులు క్రియేట్ చేశాడు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన తొలి ఇండియన్ కెప్టెన్ గా చరిత్ర సృష్టించాడు. 299పరుగుల స్కోరును బీట్ చేసే క్రమంలో మరోసారి మొనగాడి ఆట ఆడాడు విరాట్ కోహ్లీ. ఇప్పటికే ద ఫైటర్.. ద చేజర్ గా.. పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ… మరో సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడి… వన్డే కెరీర్ లో 39వ సెంచరీ పూర్తిచేశాడు. కెప్టెన్ గా కోహ్లీ చేసిన ఈ సెంచరీ.. అతడికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఆస్ట్రేలియాపై ఆస్ట్రేలియాలో సెంచరీ చేసిన తొలి ‘భారత కెప్టెన్’ గా కోహ్లీకి గుర్తింపు దక్కింది.

ఇంటర్నేషనల్ కెరీర్ లో కోహ్లీకిది 64వ సెంచరీ. సంగక్కర(63 సెంచరీలు)ను అధిగమించాడు. అంతర్జాతీయ మ్యాచ్ లలో అత్యధిక సెంచరీల్లో రికీపాంటింగ్(71), సచిన్ టెండూల్కర్(100) మాత్రమే కోహ్లీ ముందున్నారు. ఇండియా గెలిచిన మ్యాచ్ లలో సెంచరీలు చేసిన రికార్డ్ ను బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యాడు కోహ్లీ. విన్నింగ్ మ్యాచ్ లలో సచిన్ టెండూల్కర్ 33 సెంచరీలు చేస్తే… విరాట్ కోహ్లీ 32 సెంచరీలు చేశాడు.  వన్డేల్లో ఇప్పటివరకు 10వేల 309 రన్స్ చేశాడు కోహ్లీ. అత్యధిక పరుగుల్లో కోహ్లీ ముందు మరో పదిమంది బ్యాట్స్ మన్ ఉన్నారు.

భారత కెప్టెన్  – హయ్యెస్ట్ స్కోర్   

విరాట్ కోహ్లీ(2019)   – 104

అజారుద్దీన్ (1992) -93

సచిన్ టెండూల్కర్(2000- పాకిస్థాన్ పై) – 93

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy