కౌంట్‌డౌన్‌: గురువారం నింగిలోకి PSLV C-39

PSLV C-39భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రయోగానికి సిద్ధమైంది. PSLV C-39  రాకెట్‌ ద్వార IRNSS-1H (రీప్లేస్‌మెంట్‌) ఉపగ్రహాన్ని స్పేస్ లోకి ప్రయోగించేందుకు రంగం సిద్ధమైంది. సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి గురువారం (ఆగస్టు31) రాత్రి 7 గంటలకు ఈ కృత్రిమ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇందుకోసం బుధవారం (ఆగస్టు30) మధ్యాహ్నం కౌంట్‌డౌన్‌ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మంగళవారం (ఆగస్టు29) నిర్వహించిన మిషన్‌ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్‌ఆర్‌)లో అధికారికంగా ప్రకటించారు.

గురువారం సాయంత్రం (ఆగస్టు31) 6.59 గంటలకు ప్రయోగం జరుగుతుందని మొదట ప్రకటించారు. కానీ తర్వాత లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు చైర్మన్‌ పి.కున్హికృష్ణన్‌ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ప్రయోగ సమయాన్ని మరో నిమిషం పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం (ఆగస్టు29)  మధ్యాహ్నానికి రాకెట్‌కు అన్నిరకాల పరీక్షలు నిర్వహించి ప్రయోగానికి సిద్ధం చేశారు. ప్రయోగానికి 29 గంటల ముందు అంటే.. బుధవారం(ఆగస్టు30)  మధ్యాహ్నం 2 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమవుతుంది. PSLV C-39  ద్వారా 1,425 కిలోల బరువు కలిగిన IRNSS-1H  (రీప్లేస్‌మెంట్‌) ఉపగ్రహాన్ని స్పేస్ లోకి పంపించనున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy