క్యాబ్ అధ్యక్షునిగా సౌరబ్ గంగూలీ

sourav-cabబెంగాల్ క్రికెట్ సంఘం(క్యాబ్) అధ్యక్షునిగా సౌరబ్ గంగూలీ నియామకం అయ్యే అవకాశం ఉంది. తాజాగా మమతా బెనర్జీతో గంగూలీ భేటీ కావడంతో ఈ వార్తకు బలం చేకూరింది. తృణమూల్ కాంగ్రెస్ నేతలు అరూప్ బిస్వాల్, సుబ్రతా ముఖర్జీ కూడా క్యాబ్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు, క్యాబ్ చీఫ్ జగ్మోహన్ దాల్మియా మరణించడంతో ఈ రెండు పదవులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం క్యాబ్ సంయుక్త కార్యదర్శిగా ఉన్న గంగూలీని చీఫ్ గా నియమిస్తే బాగుంటుందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy