క్రికెట్ కింగ్ మేకర్ ఇకలేరు

849e8ef9-f8aa-438d-bb4e-09d8d35a3a1cwallpaper1భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు జగ్  మోహన్ దాల్మియా చనిపోయారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న దాల్మియా చికిత్స పొందుతూ కన్నుమూశారు. BCCI ని ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా మార్చిన ఘనత అందుకున్న దాల్మియా… మధ్యలో BCCI కి దూరమైనా… చివరకు బోర్డు అధ్యక్ష పదవిలో ఉండగానే చనిపోయారు.

కోల్ కతాలోని బీఎం బిర్లా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు. గుండెపోటు రావటంతో.. గురువారం రాత్రి హాస్పిటల్ లో చేరిన దాల్మియాను బతికించేందుకు… డాక్టర్లు తీవ్రంగా శ్రమించారు. 3 రోజులు ఐసీయూలో ఉన్నా… దాల్మియా ఆరోగ్యం కుదుటపడలేదు. పరిస్థితి మరింత విషమించడంతో… దాల్మియా చనిపోయారు.

భారత క్రికెట్ తో 30 ఏళ్ల అనుబంధం ఉన్న దాల్మియా చనిపోవడంతో.. క్రికెట్, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, అనిల్ కుంబ్లే సహా చాలా మంది ట్విట్టర్ లో సంతాపం తెలిపారు. భారత క్రికెట్ కు ఆయన చేసిన సేవలు మరువ లేనివన్నారు. దాల్మియా మరణవార్త తెలియగానే.. బీఎం బిర్లా ఆస్పత్రికి వచ్చారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

దాల్మియా మృతికి బీసీసీఐ సంతాపం ప్రకటించింది. ఇండియన్ క్రికెట్ కు ఆయన మరణం తీరని లోటన్నారు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్. ఐసీసీ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా సంతాపం ప్రకటించాయి. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ డెవలప్ మెంట్ కోసం దాల్మియా పనిచేశారన్నారు ఐసీసీ సీఈవో డేవ్ రిచర్డ్ సన్. చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా సంతాపం వ్యక్తం చేశారు. బీసీసీఐని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దాల్మియా కృషిచేశారన్నారు. ప్రజల సందర్శన కోసం ఇవాళ మధ్యాహ్నం వరకు దాల్మియా మృతదేహాన్ని.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్ లో ఉంచనున్నారు. ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని బెంగాల్ సర్కార్ నిర్ణయించింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy