క్రికెట్ లోకి శ్రీశాంత్ రీ ఎంట్రీ

ఐపీఎల్ స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో పాటు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) నిషేధాన్ని ఎదుర్కొంటోన్న ఫాస్ట్‌ బౌలర్‌ శ్రీశాంత్‌  గ్రౌండ్ లో అడుగుపెట్టాడు.  ఐతే ఏ క్లబ్‌ తరఫున ఆడుతున్నాడన్న వివరాలను శ్రీశాంత్ తెలపలేదు. తన ఇన్‌స్టాగ్రాంలో మ్యాచ్ ఫొటోలను, వీడియోలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో శ్రీశాంత్‌ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌ కూడా చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

35 ఏళ్ల శ్రీశాంత్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఒకవేళ BCCI అతనిపై నిషేధాన్ని ఎత్తివేసినా ప్రస్తుత భారత బౌలింగ్ దళం పటిష్టంగా ఉండటంతో చోటు దక్కడం కష్టమే. అయితే  విదేశాల్లో జరిగే టీ20 టోర్నీల్లో ఆడేందుకు అతడికి అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయి. భవిష్యత్‌లో మరికొన్నేళ్ల పాటు క్రికెట్ ఆడేందుకు శ్రీశాంత్ సాధన చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం శ్రీశాంత్ క్రికెట్ ఆడిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టీమిండియాలోకి ఎప్పుడు వస్తున్నావు.. ఆల్‌ ది బెస్ట్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

#discipline #Cricket

A post shared by Sree Santh (@sreesanthnair36) on

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy