క్రికెట్: శ్రీలంక టూర్ షెడ్యూల్

Nidahas-Trophyట్రై సిరీస్ కు రెడీ అవుతోది టీమిండియా. సౌతాఫ్రికా టూర్ ముగియగానే మరోసారి శ్రీలంక టూర్ కు సన్నద్ధమవుతోంది. శ్రీలంక 70వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని అక్కడ ఓ ట్రై సిరీస్ ఆడటానికి BCCI ఓకే చెప్పింది. ఈ ముక్కోణపు సిరీస్‌లో ఇండియా, శ్రీలంకతోపాటు బంగ్లాదేశ్ ఆడనుంది. మార్చి 6 నుంచి మార్చి 18 వరకు ఈ నిదహాస్ ట్రోఫీ జరుగుతుంది. సిరీస్‌లో భాగంగా ప్రతి టీమ్ మిగతా రెండు టీమ్స్‌తో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. టాప్ రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే అన్ని మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లను డీస్పోర్ట్ లైవ్ ప్రసారం చేయనుంది. భారత ఉపఖండంలో జరిగే టోర్నీల కోసమే డిస్కవరీ కమ్యూనికేషన్స్ ఇండియా ఈ టీవీ చానెల్‌ను లాంచ్ చేసింది. మొదటి సారి ఇండియా పార్టిసిపేట్ చేసే ఇంటర్నేషనల్ టోర్నీని డీస్పోర్ట్ లైవ్ టెలికాస్ట్ చేయనుంది.

శ్రీలంక ట్రై సిరీస్ షెడ్యూల్..

మార్చి 8: బంగ్లాదేశ్- ఇండియా
మార్చి10: శ్రీలంక- బంగ్లాదేశ్
మార్చి12: ఇండియా- శ్రీలంక
మార్చి14: ఇండియా- బంగ్లాదేశ్
మార్చి16: బంగ్లాదేశ్- శ్రీలంక
మార్చి18: ఫైనల్

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy