క్రెడిట్ కార్డులతో జాగ్రత్త

0అనాలోచితంగా అప్పు చేస్తే  తర్వాత ఇబ్బందులు తప్పవు.. వడ్డీ భారానికి తోడు మీ క్రెడిట్ రికార్డుపై మచ్చ పడుతుంది. క్రెడిట్ కార్డు ఉందికదా అని తాహుతుకు మించి కొనేస్తే వాటి వాయిదాలు చెల్లించేటప్పుడు మళ్లీ అప్పులుచేయాల్సి వస్తుంది.. ఇలా అప్పులపై అప్పుల చేసుకుంటే పోతే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదముంది.. ఇలా అప్పులు అప్పారావు కాకుండా ఉండాలంటే అప్పులు చేయడంలో కూడా ప్లాన్ ఉండాలి.. అదేమిటో ఈ వారం మీ పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ .. వెల్త్ మేనేజ్ మెంట్ లో తెలుసుకుందాం

ఆర్దికావసరం మనిషిని ఏమైనా చేసేందుకు ఉరికొల్పుతుంది..డబ్బు అవసరమైన ఆ క్షణంలో ఎంత వడ్డీ అయినా.. ఎన్ని నిబంధనలైనా ఒప్పుకుంటారు.. డబ్బు చేతికి వచ్చి ..ఆ సమయంలో అవసరం తీరితే చాలు తరువాత సంగతి తరువాత చూసుకుందామనుకునే వారి శాతం అధికంగానే ఉంటుంది. ఇలాంటి మనస్తత్వమున్న వారిలో ఎక్కవ మంది అప్పుల ఊబిలో కూరుకుపోతారని  పైనాన్షియల్ అడ్వైజర్లు విశ్లేషిస్తున్నారు.

ఆర్ధికావసరం కోసం అప్పు చేయడం ఒకటైతే.. ఆఫర్లు ఇస్తున్నారు కదా అని.. వాయిదాల పద్దతిలో చెల్లించొచ్చు అంటూ  వస్తువులను అవసరమున్నా లేకున్నా కొనేసే వారు కూడా ఎక్కవే.. ఈ పరిస్థితి పండగల సీజన్ లో ఎక్కవగా కనబడుతుంది. క్రెడిట్ కార్డు ఉన్నవారు.. వారి కోసమే కాకుండా .. ఫ్రెండ్స్.. రిలేటివ్ ల కోసం కూడా ఉపయోగిస్తుంటారు.. తరువాత వాయిదాలు చెల్లించేటప్పుడు వచ్చే ఇబ్బందులు ముందుగా ఊహించే వారి శాతం కూడా తక్కువే.

తెలుగు సంవత్సరాది ఉగాది మరో నెలరోజుల్లో వచ్చేస్తోంది.. ఉగాదిని శుభప్రదంగా భావించి కొత్త బట్టలు… ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తోపాటు కొత్త వాహనాలు కొనేస్తుంటారు.. ఇక క్రెడిట్ కార్డు ఉన్న వారిలో ఎక్కువ మంది ఉగాది పండగ షాపింగ్ లో కంట్రోల్ లేకుండా వస్తులను కొనేస్తుంటారు.. ఈ వీక్ నెస్ ను  ఎన్ కాష్ చేసుకునేందుకు షాపింగ్ మాల్స్ నుంచి సూపర్ బజార్ల వరకు అన్ని రిటైల్ సంస్థలు పోటీ పడుతుంటాయి. టీవీలు.. ఫ్రిజ్ లు.. ఫర్నిచర్.. కంప్యూటర్లు.. మొబైల్ ఫోన్స్ ఇలా ఒకటేమిటీ.. ఎదైనా సరే.. ఇన్ స్టాల్ మెంట్ల రూపంలో  అమ్మేందుకు రిటైల్ స్టోర్ లు సదా సిద్దంగా ఉంటాయి.. ఇవే కాక ఇల్లు, కారులాంటివి కూడా వచ్చే ఉగాదికి కొనడాన్ని సెంటిమెంట్  గా భావించేవారు  ఎక్కువగానే ఉంటారు.

వాయిదాల పద్దతిలో వస్తువులను పర్చేజ్ చేయాలనుకునే వారు కొన్ని రూల్స్ పాటించాలి.. లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులనెదుర్కోనక తప్పదు. వస్తువులను కొనే ముందు వాటి లిస్టును సిద్ధం చేసుకోవాలి..వాటిలో అత్యవసరంగా కావాల్సినవి..కొద్ది కాలం వాయిదా వేస్తే పరావాలేదు.. ఇప్పుడు కొనకపోయినా పర్వాలేదు.. ఇలా ప్రయారిటీ వారిగా లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. వీటిలో మస్ట్ గా కొనాల్సిన వస్తువులు మీ బడ్జెట్ లో దొరుకుతాయా లేదే అనేది చూసుకోవాలి. ఒక వేల మీరు కొనాలనుకున్న వస్తువు మీ బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంటే ఆల్ట్రనేటివ్ ఏమిటో ముందుగానే నిర్ణయించుకోవాలి.. కొంత మందిని  తప్పిస్తే మెజారిటీ వారికి నెల నెల వచ్చే ఆదాయంలో పెద్దగా మార్పుండదు. దీన్ని లెక్కలోకి తీసుకుని మీ ఖర్చులు పోగా మిగతా మొత్తంతో  ఏ వస్తువు మీకు తప్పని సరి అవసరమో  గుర్తించి దాన్ని మాత్రమే కొనాలి. నాలుగైదు షోరూంలు తిరిగి లాస్ట్ ప్రైస్ ఎంతో తెలుసుకోవాలి.  ఆ తరువాతే మీరు ఎంపిక చేసుకున్న షోరూంలో ఈ జీరో  పర్సెంట్ ఇంట్రెస్ట్ EMI స్కీంలో తీసుకోవాలి. లేదంటే లోన్ తోపాటు వడ్డీ లేదని తొందరపడి వస్తువును కొనేస్తే ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది. దీంతో పాటు వస్తువు సంబంధించిన యాస్ససరీస్ ను ఎక్కువ ధరకు మీకు అంటగట్ట ప్రమాదం కూడా ఉంది. సాధ్యమైన వంత వరకు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల నుంచి ఈ లోన్స్ తీసుకుంటే మంచింది. ప్రైవేటు బ్యాంకులు, ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలు నుంచి తీసుకుంటే  హిడెన్ కాస్ట్ తో పాటు అనుకోని కారణంగా ఇన్ స్టాల్ మెంట్ కట్టకపోతే  ఎక్కువ మొత్తంలో పెనాల్టీ వసూలు చేస్తారు. 30 వేల రూపాయల పైగా ధర ఉండే వస్తువులను కొనుగోలు చేస్తే సెక్యూరిటీ కోసం ఇన్పూరెన్స్ చేయాలి.  ఈ ఇన్సూరెన్స్ ప్రీమీయం మీ జేబులోంచే కట్టాల్సి ఉంటుందనేది గుర్తుంచుకోండి.  కారు లేదా ఇల్లు కొనాలనుకున్నప్పుడు మీ సిబిల్ స్కోర్  ఎంతో తెలుసుకుంటే మంచింది.

ఉగాది నుంచి  కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ పండగకు కొత్త వస్తువులకు బాగా గిరాకి ఉంటుంది. ఇందులో ఫర్నిచర్, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దీనికి తగ్గట్టూ రిటైల్ స్టోర్స్ కూడా జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటూ ఇన్ స్టాల్ మెంట్ స్కీంల్లో వస్తువులు కొనుక్కోండంటూ ఆఫర్స్ ను ప్రకటిస్తాయి. మొబైల్ ఫోన్స్, ఎల్ సీడీ, ఎల్ ఈడీ టీవీలు, ఫ్రిజ్ లు లాంటి వైట్ గూడ్స్ కాక రెడిమెడ్ డ్రసెస్, షూస్,  జ్యుయలరీ, ఫర్నిచర్ ఇలా ఒకటేమిటి అన్ని ఇప్పుడు జీరో పర్సెంట్ స్కీంలో కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. నీల్సన్ మెకెన్సీ తాజా సర్వే ప్రకారం మొత్తం అమ్మకాల్లో  50 శాతం వాటా ఈ జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ స్కీంలదే. రిటైల్ సెగ్మెంట్లోకి మాల్స్ రాకతో ఈ స్కీంలకు మరింత ఆదరణ పెరిగింది. అప్పటికప్పుడే లోన్ అప్రూవల్ తోపాటు కొద్దిపాటి డాక్యుమెంటేషన్ తో అరగంటలో ప్రాసెస్ మొత్తం పూర్తయ్యి ప్రాడెక్ట్ డెలివరి ఇచ్చేస్తుండటంత్ ఈ స్కీంకు కస్టమర్ల నుంచి ఆదరణ పెరుగుతోంది.

ఇది అందరికి వర్తిస్తుందనుకుంటే పొరపాటే.. రిటైల్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్న ఫైనాన్స్ సంస్థలు.. బ్యాంకులు లోన్ తీసుకోవాలనుకునే వారి క్రెడిట్ హిస్టరీని చూసి లోన్ ఆఫర్ చేస్తాయి.. మీరు గతంలో లోన్ తీసుకుని సరిగ్గా ఇన్ స్టాల్ మెంట్ చెల్లించడంలో విఫలమయ్యారా.. గతంలో తీసుకున్న లోన్ వివరాలు… మీ ఆదాయంలో ఎంత శాతం ఇతర నెల వారీ వాయిదాల రూపంలో చెల్లిస్తున్నారు.. ఇలాంటీ వివరాలు సిబిల్ ట్రాన్స్ యూనియన్ స్కోరు నుంచి తెలుసుకుని ఈ తరువాతే మీకు లోన్ ఇవ్వాళా వద్దా అనేది నిర్ణయిస్తారు

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy